ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
ABN, First Publish Date - 2022-03-06T03:36:34+05:30
మండలంలోని ముత్యాలపాడు రైతు భరోసా కేంద్రంలో శనివారం జడ్పీటీసీ మన్నెం శీనయ్య, తిప్పగుంటపాళెం పీఏసీఎస్ చైర్మన్ రాజనేని పిచ్చయ్యనాయుడు, అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
చిల్లకూరు, మార్చి 5: మండలంలోని ముత్యాలపాడు రైతు భరోసా కేంద్రంలో శనివారం జడ్పీటీసీ మన్నెం శీనయ్య, తిప్పగుంటపాళెం పీఏసీఎస్ చైర్మన్ రాజనేని పిచ్చయ్యనాయుడు, అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సభ్యుడు మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. అధికారులు రాజనేని రామానాయుడు, సుబ్రమణ్యం, భవాని, వీఏఏ చెంచుకృష్ణయ్య, వెంకటకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-03-06T03:36:34+05:30 IST