అనుమానాస్పద స్థితిలో మృతి
ABN, First Publish Date - 2022-08-05T05:00:57+05:30
మండలంలోని వేల్పులగుంట గ్రామానికి చెం దిన పెంచలయ్య (62) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.
ఏ ఎస్ పేట,ఆగస్టు4 : మండలంలోని వేల్పులగుంట గ్రామానికి చెం దిన పెంచలయ్య (62) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతిడి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సుబహాని తెలిపారు. సోమవారం ఉదయం ఇంటి నుంచి హసనాపురం గ్రామనికి వెళ్లిన తన తండ్రి పెంచలయ్య రాత్రి చెరువు వద్ద చనిపోయి ఉన్నాడని, ఆయన వెంట ఉన్న మొలకల ఆంజనేయులే తన తండ్రిని ఏమైనా చేశాడేమోనని మృతుడి కొడుకు ఫిర్యాదులో పేర్కొన్నాడని తెలిపారు. మృతదేహానికి పోస్టు మార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు.
Updated Date - 2022-08-05T05:00:57+05:30 IST