ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిషేధిత గడ్డి మందు విక్రయిస్తే లైసెన్స్‌ రద్దు

ABN, First Publish Date - 2022-12-03T23:38:02+05:30

నిషేధిత గడ్డిమందు అక్రమ విక్రయాలపై ‘ఆంధ్రజ్యోతి’లో ‘ఇదిగో గ్లైపోశ్లాట్‌’ శీర్షిక తో శుక్రవారం ప్రచురించిన కథనానికి పొదల కూరు వ్యవసాయ శాఖ అధికారులు స్పం దించారు.

అవగాహన సదస్సులో పాల్గొన్న దుకాణ యజమానులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొదలకూరు, డిసెంబరు 3 : నిషేధిత గడ్డిమందు అక్రమ విక్రయాలపై ‘ఆంధ్రజ్యోతి’లో ‘ఇదిగో గ్లైపోశ్లాట్‌’ శీర్షిక తో శుక్రవారం ప్రచురించిన కథనానికి పొదల కూరు వ్యవసాయ శాఖ అధికారులు స్పం దించారు. నిషేధిత గడ్డి మందు విక్రయాలు సా గిస్తే ఆయా దుకాణాల లైసెన్సులు రద్దు చేసి వా రిపై 6ఏ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామ ని వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు శివనాయక్‌ హెచ్చరించారు. శనివారం పట్టణం లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో పురుగు మందుల దుకాణాల యజమానులతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భం గా ఏడీ శివనాయక్‌ మాట్లాడుతూ నిషేధిత గడ్డి మందును పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకు ని దొంగచాటుగా విక్రయాలు సాగిస్తున్నారని పత్రికలో కథనం వచ్చిందని అన్నారు. ఇప్పటి నుంచి ఎవరైనా గడ్డి మందును విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమానికి 23 పురుగు మందుల దుకాణాల యజమానులతో పాటు వ్యవసాయ ఏవో వాసు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-03T23:38:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising