ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలకు తూట్లు!

ABN, First Publish Date - 2022-10-01T04:44:52+05:30

ఆదాయ వనరులు సమకూర్చుకోవడమే లక్ష్యంగా నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు కందుకూరులోని బీఎ్‌సఎనఎల్‌ అధికారులు. ఇప్పటికే ఉన్న కార్యాలయ భవనం ఫుష్‌ బ్యాక్‌ స్థలంలో లక్షలు వెచ్చించి నిర్మించిన ప్రహరీని కూల్చి గదులు నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు.

బీఎ్‌సఎనఎల్‌ కార్యాలయ ఆవరణలో ప్రహరీ కూల్చి పోసిన ముగ్గు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫుష్‌ బ్యాక్‌ స్థలంలో వాణిజ్య సముదాయం

రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన ప్రహరీ కూల్చివేత

ఆశ్చర్యపరుస్తున్న బీఎ్‌సఎనఎల్‌ అధికారుల తీరు

అప్రూవల్‌ లేదు : మున్సిపల్‌ కమిషనర్‌


కందుకూరు, సెప్టెంబరు 30 : ఆదాయ వనరులు సమకూర్చుకోవడమే లక్ష్యంగా నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు కందుకూరులోని బీఎ్‌సఎనఎల్‌ అధికారులు. ఇప్పటికే ఉన్న కార్యాలయ భవనం ఫుష్‌ బ్యాక్‌ స్థలంలో లక్షలు వెచ్చించి నిర్మించిన ప్రహరీని కూల్చి గదులు నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. కనీసం ఆరు అడుగులు కూడా లేని ఆ స్థలంలో  గదుల నిర్మాణ పునాదులు వేసేందుకు ప్లానింగ్‌ ముగ్గు వేశారు. ఇది స్థానికులను ఆశ్చర్యపరస్తోంది. కందుకూరు పట్టణ నడిబొడ్డున ఉన్న పోస్టాఫీసు సెంటర్‌లో అటు పామూరు రహదారి ఇటు మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లే రహదారి కూడలిలో బీఎ్‌సఎనఎల్‌ కార్యాలయం ఉంది. దానికి ఉన్న కొద్దిపాటి ఖాళీ స్థలంలో వాణిజ్య సముదాయం నిర్మించి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించటమే గాక గుట్టుచప్పుడు కాకుండా టెండర్‌ నిర్వహించారు. దీంతో అక్కడ షాపులు నిర్వహణ హక్కుని వైసీపీలోని ఓ యువనేత దక్కించుకున్నాడు. అయితే ముందస్తు ఒప్పందంలో భాగంగా రహస్య టెండర్‌ నిర్వహించి ఆ ప్రాంతాన్ని ఆయనకు అప్పగించారా అన్న సందేహాలు కూడా లేకపోలేదు. అంతే ఆగమేఘాల మీద లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించి ఉన్న ప్రహరీనికూల్చి చదును చేసి హడావిడిగా ముగ్గుపోశారు. వాస్తవానికి పామూరు రోడ్డును 100 అడుగుల రహదారిగా, మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లే రోడ్డును 50 అడుగుల రోడ్డుగా విస్తరించేందుకు మాస్టర్‌ ప్లాన సిద్ధమై ఉంది. ఈ రహదారులలో ప్రస్తుతం ఎవరైనా నూతనంగా గృహం, వాణిజ్య సముదాయం నిర్మించాలంటే మాస్టర్‌ఫ్లానకు అనుగుణంగా రోడ్డుకి అభిముఖంగా 3 మీటర్లు మున్సిపాలిటీకి రిజిసే్ట్రషన చేస్తేనే ప్లానకు అనుమతి ఇస్తున్నారు. గత కొన్నేళ్లుగా నూతనంగా భవనాలు నిర్మించిన వారు ఆ మేరకు వదిలేసే నిర్మించుకుంటున్నారు. అయితే ఇవేమీ తమకు పట్టవన్నట్లుగా మున్సిపల్‌ అధికారులు పుష్‌బ్యాక్‌ ఏరియాలో వాణిజ్య సముదాయం నిర్మించాలని ప్రహరీ కూల్చేశారు. నిజానికి ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న డ్రైనేజీ నుంచి బీఎ్‌సఎనఎల్‌ భవనం వరకు కొన్నిచోట్ల 10 అడుగులు ఉండగా కొన్నిచోట్ల ఆరేడు అడుగులే ఉంది. అయితే ఇక్కడ వాణిజ్య సముదాయం నిర్మిస్తే పార్కింగ్‌ ఎలా అన్న ప్రశ్నకు కానీ, ఫుష్‌బ్యాక్‌ ఏరియాలో షాపులు ఎలా నిర్మిస్తారని కానీ అడిగే ప్రశ్నలకు మున్సిపల్‌ అధికారుల వద్ద సమాధానం లేదు. ఈ విషయమై మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.మనోహర్‌ను ప్రశ్నించగా ప్లాన అప్రూవల్‌ లేకుండా తాము నిర్మించనివ్వబోమని, నిబంధనలు పాటిస్తే అక్కడ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించడానికి వీల్లేదన్నారు. ఈ రోడ్ల వెంట నూతనంగా ఏం నిర్మించాలన్నా పది అడుగులు వదలాల్సి ఉందని, అక్కడ ఉన్నది పది అడుగుల లోపే అయినందున ఎలా నిర్మిస్తారని ఆయన ప్రశ్నించారు. బీఎ్‌సఎనఎల్‌ అధికారులు తమను సంప్రదించలేదని అయితే తాము నిర్మాణం ప్రారంభిస్తే అడ్డుకుని కూల్చి వేస్తామని స్పష్టం చేశారు. అయితే ఈ విషయమై బీఎ్‌సఎనఎల్‌ అధికారుల వివరణ కోసం ఎంత ప్రయత్నించినా వారు అందుబాటులోకి రాకపోవటం విశేషం.

Updated Date - 2022-10-01T04:44:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising