ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గజానికో గుంత..!

ABN, First Publish Date - 2022-01-03T03:43:41+05:30

నెల్లూరు-తాటిపర్తి మార్గంలో ప్రయాణం దుర్భరమైంది. ఆ మార్గంలో ప్రయాణించాలంటే వాహదారులు సుముఖత చూపడం లేదు.

పూర్తిగా దెబ్బతిన్న నెల్లూరు - తాటిపర్తి రహదారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంబేలెత్తిస్తున్న నెల్లూరు-తాటిపర్తి రహదారి 

నెలలు గడుస్తున్నా పట్టించుకోని వైనం

ఇలాగైతే ప్రయాణం సాగించేదెలా? 

నెల్లూరురూరల్‌, జనవరి 2 : నెల్లూరు-తాటిపర్తి మార్గంలో ప్రయాణం దుర్భరమైంది. ఆ మార్గంలో ప్రయాణించాలంటే వాహదారులు సుముఖత చూపడం లేదు. అత్యవసరమైనా వామ్మో... ఆ రోడ్డా... మేము రాలేము..! అంటూ ఖరాఖండిగా చెబుతున్నారు. అక్కడక్కడ గుంతలతో అధ్వానంగా ఉన్న నెల్లూరు-తాటిపర్తి రహదారిపై ఇటీవల వరద పోటెత్తడంతో గజానికో గుంత పడి పూర్తిగా దెబ్బతినింది. ఇరువైపుల కొట్టుపోయిన రోడ్డు, నామరూపాలు కోల్పోయిన కల్వర్టులు, బావులను తలపిస్తున్న గుంటలతో కనీస ప్రయాణం కష్టంగా మారింది. ఈ రహదారిపై ప్రయాణించాలంటే ఓళ్లంతా ఊనమయ్యే విధంగా ఉంది. పెద్ద వాహనాలు దేవుడెరుగు.. చిన్న పాటి స్కూటర్లు సైతం ప్రయాణించలేని దుస్థితి ఏర్పడింది. జొన్నవాడ మలుపు నుంచి గొల్లకందుకూరు వరకు ఇదే పరిస్థితి. ములుముడి కలుజు దాటాక కందమూరు క్రాస్‌రోడ్డు వరకు రోడ్డంతా దయనీయంగా ఉంది. ఈ మార్గం నుంచి రోజూ వందల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. అనేక గ్రామాలకు ఇదే ప్రధాన మార్గం. అయినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులెవ్వరూ కనీసం పట్టించుకోకపోవడంపై ఈ ప్రాంత వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు జోక్యం చేసుకుని కనీసం తాత్కాలిక మరమ్మతులైనా చేయాలని కోరుతున్నారు. 



Updated Date - 2022-01-03T03:43:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising