ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mekapati వర్గీయుల్లో తారాస్థాయికి చేరిన విభేదాలు

ABN, First Publish Date - 2022-06-13T17:40:44+05:30

మేకపాటి (Mekapati) వర్గీయుల్లో తీవ్ర విభేభాలు బహిర్గతమవుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Nellore జిల్లా: మేకపాటి (Mekapati) వర్గీయుల్లో తీవ్ర విభేభాలు బహిర్గతమవుతున్నాయి. సర్దుబాటు చేయడానికి మంత్రులు (Ministers), ఎమ్మెల్యేలు (MLAs) హైరానా పడుతున్నారు. పార్టీ నేతల సమావేశంలో జడ్పీటీసీ మల్లు సుధాకర్ రెడ్డిపై వైసీపీ నేత రేవూరి వేణుగోపాల్ రెడ్డి బూతులతో విరుచుకుపడ్డారు. ఒకరినొకరు బహిరంగంగా తిట్టుకోవడం చర్చగా మారింది.


ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారానికి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అసలు రావడంలేదు. ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా నియోజకవర్గంవైపు తొంగి చూడలేదు. ఈ ఉప ఎన్నికలో లక్ష ఓట్ల మెజారిటీ రావాలని సీఎం జగన్ పార్టీ నేతలకు టార్గెట్ పెట్టారు. కనీసం సగమైనా అందుకుంటామో లేదో అనే అనుమానాలు వైసీపీ శ్రేణుల్లో నెలకొన్నాయి. ఒక్కో మండలానికి ఒక మంత్రి, ఎమ్మెల్యేను ఇన్చార్జులుగా నియమించినా పరిస్థితులు సానుకూలంగా లేవు. మేకపాటి వర్గీయులు మూడు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై మరొకరు బూతులు తిట్టుకుంటున్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో ఎవరికి వారే అన్నట్టుగా వైసీపీ నేతలు ఉన్నారు.

Updated Date - 2022-06-13T17:40:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising