Navjeevan Express Rail: నవజీవన్ ఎక్స్ప్రెస్లో మంటలు తప్పిన పెద్ద ప్రమాదం..
ABN, First Publish Date - 2022-11-18T07:12:35+05:30
అహ్మదాబాద్ నుంచి చెన్నైవెళ్తున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్(Navjeevan Express) పెద్ద ప్రమాదం
Nellore: అహ్మదాబాద్ నుంచి చెన్నై(Ahmedabad to Chennai) వెళ్తున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్(Navjeevan Express) పెద్ద ప్రమాదం తప్పింది. నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు చెలరేగాయి. పాంట్రీకారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్లో(Gudur Junction Railway Station) మంటలను రైల్వే అధికారులు అదుపులోకి తీసుకువచ్చారు. సుమారు గంట పాటు గూడూరు రైల్వే స్టేషన్లో నవజీవన్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. రైల్వే వర్గాల అప్రమత్తంతో భారీ ప్రమాదం తప్పింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
Updated Date - 2022-11-18T07:12:38+05:30 IST