ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికార బలంతో ప్రకృతి సంపద దోపిడీ

ABN, First Publish Date - 2022-12-15T23:41:19+05:30

: వైసీపీ మూడున్నరేళ్ల పాలనలో రాష్ట్రంలోని ప్రకృతి సంపదను నిలువునా దోచేశారని మాజీమంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.

చిట్టేపల్లి వద్ద అక్రమ గ్రావెల్‌ను పరిశీలిస్తున్న సోమిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొదలకూరు, డిసెంబరు 15 : వైసీపీ మూడున్నరేళ్ల పాలనలో రాష్ట్రంలోని ప్రకృతి సంపదను నిలువునా దోచేశారని మాజీమంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. పొదలకూరు పంచాయతీ పరిధిలోని 707 సర్వే నెంబరులో ఉన్న చిట్టేపల్లి తిప్పపై జరుగుతున్న అక్రమ గ్రావెల్‌ను, తిప్ప కరిగిన తీరును ఆయన గురువారం స్వయంగా ద్విచక్రవాహనంపై వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రికి మండలంలో కుడి, ఎడమ చేతులుగా ఉంటున్న అధికార పార్టీ నాయకుల ధన దాహానికి తిప్పలు కరిగిపోతున్నాయని విమర్శించారు. సర్వే నెంబరు 707లో సుమారు 100 ఎకరాల్లో అక్రమ గ్రావెల్‌ రవాణా జరుగుతోందన్నారు. స్థానికులు అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందికి ఫిర్యాదు చేస్తున్నా మైనింగ్‌, రెవెన్యూ, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ ఫిర్యాదులన్నీ బుట్టదాఖలవుతున్నాయన్నారు.

ఫ రైతుల ఖాతాల్లో నష్ట పరిహారం ఏది?

రెండేళ్లుగా తుఫాన్లకు జరిగిన పంట నష్టానికి రైతుల ఖాతాల్లో పరిహారం జమకాలేదని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. మాండస్‌ తుఫాను కారణంగా జిల్లాలో వరి నారుమళ్లు, పత్తి, మిరప, పొగాకు, మినుము, నిమ్మ పంటలు దెబ్బతిన్నాయన్నారు. నష్టపోయిన రైతులకు నూరు శాతం సబ్సిడీపై విత్తనాలు అందించాలన్నారు. అంచనాలు త్వరితగతిన పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలన్నారు. నావూరు పెద్దవాగు, ఆల్తుర్తి తిప్ప వాగును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. గ్రామాల్లో సిమెంట్‌ రోడ్డు వేసి, డ్రైనేజీ కాలువలు కట్టకపోవడంతో జనావాసాల్లోకి నీరు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అంకుపల్లి కాలనీ, చెన్నారెడ్డిపల్లిలో వెంటనే డ్రైనేజీ, కాలువల నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-12-15T23:41:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising