ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెంగమాంబ బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు : ఆర్డీవో

ABN, First Publish Date - 2022-06-18T03:50:23+05:30

మండలంలోని నర్రవాడ గ్రామంలో ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న వెంగమాంబ పేరంటాల బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్డీవో శీనానాయక్‌ తెలిపారు.

హుండీల లెక్కింపును పరిశీలిస్తున్న ఆర్డీవో, అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుత్తలూరు, జూన్‌ 17: మండలంలోని నర్రవాడ గ్రామంలో ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న వెంగమాంబ పేరంటాల బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్డీవో శీనానాయక్‌ తెలిపారు. శుక్రవారం ఆయన ఆలయం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. మంచినీరు, క్యూలైన్ల ఏర్పాట్లు, పారిశుధ్యం మెరుగుకు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం కోనేరు, ఎద్దులు బండలాగుడు పోటీలు నిర్వహించే ప్రదేశాలను పరిశీలించారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట తహసీల్దారు సుధాకర్‌రావు, దేవదాయ శాఖ జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ పీ.శ్రీనివాసులరెడ్డి, నెల్లూరు డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌కే చైతన్య, ఆలయ ఈవో వెంకటేశ్వర్లు, సిబ్బంది ఉన్నారు. 

హుండీ లెక్కింపు

నర్రవాడ గ్రామంలోని వెంగమాంబ ఆలయ హుండీలోని కానుకలను దేవాదాయ శాఖ అధికారులు, ఆర్డీవో శీనానాయక్‌ పర్యవేక్షణలో లెక్కించారు. 4 నెలల 28 రోజులకు సంబంధించి భక్తులు సమర్పించిన కానుకలు రూ.21,92,626 వచ్చాయి. అలాగే సౌదీ అరేబియా రియాల్స్‌ 10, యూఎస్‌ఏ డాలర్స్‌ 173 ఉన్నాయి. 

Updated Date - 2022-06-18T03:50:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising