ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నక్కలగండిలో గల్లంతైన యువకుడి మృతి

ABN, First Publish Date - 2022-07-01T02:46:13+05:30

స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు బుధవారం గ్రామ సమీపంలోని నక్కలగండి రిజర్వాయర్‌లోకి దిగి గల్లంతైన యువకుడు గ

మృతదేహాన్ని వెలికితీసిన జాలర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జాలర్ల సహాయంతో మృతదేహం వెలికితీత

వేంపాడులో విషాదఛాయలు

వరికుంటపాడు, జూన్‌ 30: స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు బుధవారం గ్రామ సమీపంలోని నక్కలగండి రిజర్వాయర్‌లోకి దిగి గల్లంతైన యువకుడు గద్దె ప్రసాద్‌(27) మృతదేహాన్ని గురువారం జాలర్ల సహాయంతో వెలికితీశారు. వేంపాడు ఎస్సీకాలనీకి చెందిన ఆ యువకుడు తన స్నేహితులతో కలిసి రిజర్వాయర్‌ వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో రిజర్వాయర్‌లోని నీటిలో కూరుకుపోయి గల్లంతవడంతో రెండు రోజులుగా  గాలింపు  చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు చేరుకొనేలోపే జాలర్ల సాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. ఒక్కసారిగా బిడ్డ మృతదేహాన్ని చూసిన  తల్లిదండ్రులు, బంధువులు భోరున విలపించారు. కాలనీలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా సుమారు కిలోమీటర్‌ దూరం వరకు కంపచెట్ల నడుమ మృతదేహాన్ని స్ధానికులతో కలిసి  ఒడ్డుకు మోసుకొచ్చి మానవత్వం చాటుకున్న ఎస్‌ఐ బాలమహేంద్రనాయక్‌ను పలువురు మెచ్చుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2022-07-01T02:46:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising