ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాడు-నేడు పనులు వేగవంతం చేయండి

ABN, First Publish Date - 2022-06-26T04:56:10+05:30

జిల్లాలో రెండో విడత మనబడి నాడు-నేడు పనులను వేగవంతం చేసి నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ సీహెచ్‌.ఉషారాణి పంచాయతీరాజ్‌ అధికారులను ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ ఉషారాణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ ఉషారాణి 

నెల్లూరు (విద్య) జూన్‌ 25  : జిల్లాలో రెండో విడత మనబడి నాడు-నేడు పనులను వేగవంతం చేసి నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ సీహెచ్‌.ఉషారాణి పంచాయతీరాజ్‌  అధికారులను ఆదేశించారు. నెల్లూరులోని విద్యాశాఖ కార్యాలయంలో శనివారం విద్యాశాఖ, సమగ్రశిక్ష, పంచాయతీరాజ్‌ శాఖల ఇంజనీరింగ్‌ అధికారులతో ఆమె వెబ్‌ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో చేపట్టిన రెండో విడత పనులను ఈ విద్యా సంవత్సరం ప్రారంభం లోపు పూర్తి చేయాలని,  ఎక్కడా అలసత్వం ప్రదర్శించవద్దని తెలిపారు. మొత్తం 846 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, 1,151 అదనపు గదుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయన్నారు. 123 పాఠశాలలకు ఇంకా  అంచనాలు జనరేట్‌ చేయకుండా పరిపాలన అనుమతులు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇంజనీరింగ్‌ శాఖల అధికారులు ఈనెల చివరికి వందశాతం పరిపాలన అనుమ తులు తీసుకుని పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అదనపు గదుల శ్లాబ్‌ స్టేజీలో ఉన్న పనులను ప్రారంభించే సమయంలో ఏఈ, డీఈలు పర్యవేక్షించాలన్నారు. వాటి బిల్లులను ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేయాలన్నారు. 

Updated Date - 2022-06-26T04:56:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising