ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘డౌన్‌టౌన్‌’ మూసివేత

ABN, First Publish Date - 2022-01-21T05:06:56+05:30

పాడైపోయిన, పాచిపట్టిన చికెన్‌తో వివిధ రకాల వంటకాలు తయారు చేస్తున్నారంటూ ఫిర్యాదు అందడంతో నగరంలోని చిల్డ్రన్స్‌ పార్కు సమీపంలో ఉన్న డౌన్‌టౌన్‌ దుకాణాన్ని మూతేసినట్లు మున్సిపల్‌ ఆరోగ్య అధికారి వెంకటరమణయ్య తెలిపారు.

పాడైన చికెన్‌ను నిర్వీర్యం చేస్తున్న సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 

పాడైపోయిన ఆహారం గుర్తింపు


నెల్లూరు(సిటీ), జనవరి 20 : పాడైపోయిన, పాచిపట్టిన చికెన్‌తో వివిధ రకాల వంటకాలు తయారు చేస్తున్నారంటూ ఫిర్యాదు అందడంతో నగరంలోని చిల్డ్రన్స్‌ పార్కు సమీపంలో ఉన్న డౌన్‌టౌన్‌ దుకాణాన్ని మూతేసినట్లు మున్సిపల్‌ ఆరోగ్య అధికారి  వెంకటరమణయ్య తెలిపారు. గురువారం ఆ దుకాణంపై ఆకస్మికంగా దాడులు జరిపి నిల్వ ఉంచిన చికెన్‌, ఇతర పదార్థాలను పరిశీలించామన్నారు. అవన్నీ అనారోగ్యకరంగా ఉన్నందున వెంటనే యజమానులకు నోటీసు జారీ చేసి అనంతరం షాపును మూ సేశామన్నారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం మాత్రమే అందించాలని, ప్రమాణాలను విస్మరిస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ తరహా దాడులు కొనసాగుతా యని తెలిపారు. రుచికరంగా ఉన్నాయని నిల్వ ఉంచి ఆహారం అమ్మడం నేరమన్నారు. ప్రజలు కూడా బయట ఆహార పదార్థాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. 

పందుల పెంపకానికి 4.50 ఎకరాలు కేటాయింపు 

నగరంలో ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా, ఆనారోగ్య హేతువుగా తయారైన పందులను నగరానికి దూరంగా పెంచుకునేందుకు 4.50 ఎకరాల భూమిని కేటాయించినట్లు ఎంహెచ్‌వో వెంకట రమణయ్య వెల్లడించారు. దొంతాలి వద్ద పందుల పెంపకానికి ఆ భూమిని కేటాయించామన్నారు. పందుల పెంపకందారులు నగరంలోని పందులను వెంటనే అక్కడికి తరలించాలని ఆదేశించారు. రెండు రోజులుగా జరుగుతున్న పందుల పట్టివేత ప్రత్యేక డ్రైవ్‌ను కొనసాగిస్తామన్నారు. 

Updated Date - 2022-01-21T05:06:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising