సామాజిక విఫ్లవ కవి గుర్రం జాషువా : ఎమ్మెల్యే
ABN, First Publish Date - 2022-09-29T04:19:16+05:30
సమాజంలోని రుగ్మతలను వెలుగెత్తి చాటడంతో పాటు వాటి నిర్మూలన దిశగా ప్రజలను చైతన్యం చేయటం కోసం తన రచనల ద్వారా మహాకవి గుర్రం జాషువా విశేష కృషి చేశారని ఎమ్మెల్యే మహీధరరెడ్డి, పలువురు వక్తలు కొనియాడారు.
కందుకూరు, సెప్టెంబరు 28: సమాజంలోని రుగ్మతలను వెలుగెత్తి చాటడంతో పాటు వాటి నిర్మూలన దిశగా ప్రజలను చైతన్యం చేయటం కోసం తన రచనల ద్వారా మహాకవి గుర్రం జాషువా విశేష కృషి చేశారని ఎమ్మెల్యే మహీధరరెడ్డి, పలువురు వక్తలు కొనియాడారు. జాషువా సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి స్థానిక జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో జాషువా 127వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మహీధరరెడ్డి మాట్లాడారు. జాషువా జయంతి ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన పద్యరచన పోటీలు, పద్యాల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. పద్యరచన పోటీలో ప్రథమ బహుమతిని కవి, తెలుగు ఉపాధ్యాయుడు గుడ్లూరు వెంకటేశ్వరరావు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ముప్పవరపు కిషోర్, గాండ్ల హరిప్రసాద్, వివి శేషయ్య, ఇమ్మడిశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఆర్‌లో...
స్థానిక టీఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగువిభాగం ఆధ్వర్యంలో బుధవారం మహాకవి గుర్రం జాషువా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రవికుమార్, ఐక్యూఏసీ కో ఆర్డినేటర్ పీ.రాజగోపాలబాబు, వై.నరేంద్ర, ఏడుకొండలు, డాక్టరు కె.సుజాత, షానాజ్‌బేగం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-09-29T04:19:16+05:30 IST