ఎమ్మెల్యే స్వగ్రామంలో ‘గడప గడపపై’ రివ్యూ
ABN, First Publish Date - 2022-12-16T00:11:37+05:30
మండలంలోని ఎమ్మెల్యే స్వగ్రామమైన బ్రాహ్మణపల్లిలో ఇటీవల వరుసగా మూడురోజుల పాటు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు.
మర్రిపాడు, డిసెంబరు 15: మండలంలోని ఎమ్మెల్యే స్వగ్రామమైన బ్రాహ్మణపల్లిలో ఇటీవల వరుసగా మూడురోజుల పాటు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో తమ వద్దకు వచ్చిన సమస్యలపై నాల్గో రోజు గురువారం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి తన ఇంటి వద్ద అధికారులు, సచివాలయ సిబ్బందితో శాఖల వారీగా రివ్యూ జరిపారు. గ్రామంలో అవసరమైన పనులను ప్రభుత్వం ప్రతి సచివాలయానికి ఇస్తున్న రూ.20లక్షలను ఖర్చు చేసి, మిగిలిన పనులను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పూర్తి చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగమణి, డిప్యూటీ తహసీల్దారు ఆనంద్‌రావు, వైసీపీ మండల కన్వీనర్ సుబ్బిరెడ్డి, మాజీ కన్వీనర్ శ్రీనివాసులునాయుడు పాల్గొన్నారు.
==
Updated Date - 2022-12-16T00:11:39+05:30 IST