ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేజరు చోరీల్లో మైనర్లు

ABN, First Publish Date - 2022-03-06T03:36:10+05:30

వారికింకా యుక్తవయసు రానే లేదు. చదివిందేమో పదో తరగతి. అప్పుడే విలాసాలకు అలవాటు పడ్డారు. డబ్బు కోసం చోరీలకు

స్వాధీనం చేసుకున్న మోటార్‌సైకిళ్లను పరిశీలిస్తున్న డీఎస్పీ రాజగోపాల్‌ రెడ్డి, పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రెండునెలల్లో 9 మోటారు సైకిళ్ల అపహరణ

 పది రోజుల్లో కేసును  ఛేదించిన పోలీసులు

 మనుబోలు, మార్చి 5: వారికింకా యుక్తవయసు రానే లేదు. చదివిందేమో పదో తరగతి. అప్పుడే విలాసాలకు అలవాటు పడ్డారు. డబ్బు కోసం  చోరీలకు పాల్పడ్డారు. రెండు నెలల కాలంలోనే 9మోటార్‌సైకిళ్లను దొంగతనం చేశారు. చివరికి పోలీసులకు చిక్కారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌ రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. గతనెల 23న మనుబోలు మండ లం గురివిందపూడికి చెందిన ఆవుల శేషయ్య తన మోటార్‌సైకిల్‌ను రోడ్డు పక్క  ఉంచి, గడ్డికోసేందుకు పొలంలోకి వెళ్లి వచ్చేసరికి మోటార్‌సైకిల్‌ కనిపించలేదు. దీంతో శేషయ్య పోలీసులు ఫిర్యాదు చేశారు. సీఐ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శనివారం ఉదయం కాగితాలపూరు క్రాస్‌ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా మోటార్‌సైకిల్‌పై తిరుగుతున్న ఇద్దరు బాలురను అదుపులోకి తీసుకుని కూపీ లాగారు. వారి చెప్పిన వివరాలతో పోలీసులు నివ్వెరపోయారు. మారుతాళాల సాయంతో తెలివిగా మోటార్‌సైకిళ్లను తస్కరించి తక్కువకు అమ్మేయడం వీరిపని. రెండు నెలల్లో 9 మోటార్‌సైకిళ్లు చోరీ చేసినట్లు పోలీసులకు వెల్లడించారు. నెల్లూరు, ఓజిలి, నాయుడుపేట, మనుబోలు, గూడూరు ప్రాంతాల్లో చోరీకి గురైన మోటార్‌సైకిళ్లను మనుబోలు పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. ఆ ఇద్దరు బాలురు గూడూరు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. చోరీ కేసులను  ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన సీఐ. శ్రీనివాసరెడ్డి, మనుబోలు ఎస్‌ఐ. ముత్యాలరావును, హెచ్‌సీలు రాజు, నారయ్య, శ్రీనువాసులు, పీసీలు విష్ణు, స్వరూప్‌లతో పాటు గూడూరు ఐడీ పార్టీ పోలీసులను డీఎస్పీ అభినందించి రివార్డులు అందించారు. కేసు  విచారణ నిమిత్తం బాలుర వివరాలను నెల్లూరు కోర్టుకు సమర్పించారు. 


Updated Date - 2022-03-06T03:36:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising