ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెట్ట పైర్లను చుట్టుముట్టిన తెగుళ్లు

ABN, First Publish Date - 2022-01-05T04:50:09+05:30

పొదలకూరు వ్యవసాయ సబ్‌డివిజన్‌లోని మెట్ట పైర్లను తెగుళ్లు చుట్టుముట్టాయి. గడచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు తెగుళ్ల బారినపడ్డాయి.

క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్త
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొదలకూరు రూరల్‌,  జనవరి 4: పొదలకూరు వ్యవసాయ సబ్‌డివిజన్‌లోని మెట్ట పైర్లను తెగుళ్లు చుట్టుముట్టాయి. గడచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు తెగుళ్ల బారినపడ్డాయి. భూమిలో నెలకొన్న తేమ కారణంగా మినుము, పెసర పంటల్లో కలుపు బెడద ఎక్కువైనట్లు స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దానికి తోడు రెండు రోజులుగా కురుస్తున్న తేలికపాటి వర్షాలకు గిరక, తుంగ, ఊదర బాగా విస్తరిస్తోందని వారు వెల్లడించారు. దీని నివారణకు ఫినెక్ఫోప్రాడ్‌ మిథైన్‌ 9శాతం ద్రావణం 250మి.లీ ఒక్క లీటరుకు పిచికారీ చేయాలని సూచించారు. అనంతరం 10కిలోల యూరియా ఎకరాకు వేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ప్రస్తుతం మినుము పంట పూత దశలో ఉందని, ఈ దశలో పొటాష్‌ ఎకరాకు 10 కిలోలు వేస్తే గింజలు గట్టి పడతాయని శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు వివరించారు. దానితో పాటుగా పంటల్లో జింక్‌, ఇనుపధాతు లోపాలు కనిపిస్తున్నట్లు వివరించారు. వీటి నివారణకు లీటరు నీటికి 9కిలోల జింక్‌ సల్ఫేట్‌తో పాటు, ఇనుప ధాతు లోపానికి ప్రెడ్రిక్‌ సల్ఫేట్‌ నిమ్మ ఉప్పుతో కలిపి పిచికారీ చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ వర్షాలకు పొలాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 

Updated Date - 2022-01-05T04:50:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising