ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం

ABN, First Publish Date - 2022-09-25T05:32:50+05:30

ఓ మహిళతో ఏర్పడిన వివాహేతర సంబంధం ఒక వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. నెల్లూరు రూరల్లోని కల్లూరుపల్లిలో శుక్రవారం రాత్రి హత్యకు గురైన మన్నెపల్లి మోషే (30) కేసులో నిందితుడిని నెల్లూరురూరల్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

వివరాలు వెల్లడిస్తున్న రూరల్‌ డీఎస్పీ హరనాథరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోషే హత్య కేసులో నిందితుడి అరెస్టు

 వివరాలు వెల్లడించిన నెల్లూరు రూరల్‌ డీఎస్పీ

నెల్లూరురూరల్‌, సెప్టెంబరు 24 : ఓ మహిళతో ఏర్పడిన వివాహేతర సంబంధం ఒక వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. నెల్లూరు రూరల్లోని కల్లూరుపల్లిలో శుక్రవారం రాత్రి హత్యకు గురైన మన్నెపల్లి మోషే (30) కేసులో నిందితుడిని నెల్లూరురూరల్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. రూరల్‌ డీఎస్పీ వై.హరనాథరెడ్డి రూరల్‌ పోలీసు స్టేషన్‌లో వివరాలను వెల్లడించారు. ‘నవాబుపేటకు చెందిన మర్లపాటి ప్రదీప్‌ ఓ మహిళతో సహజీవనం చేసేవాడు.  ఆమె అతని నుంచి కూలి పని చేసుకునే మోషే వద్దకు చేరుకుని కొన్ని రోజులుగా సహజీవనం చేస్తోంది. దీనిని జీర్ణించుకోలేని ప్రదీప్‌ మోషేను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం రాత్రి కల్లూరు పల్లిలోని సాయిబాబాగుడి వీధిలో నివాసముంటున్న మోషే ఇంట్లోకి చొరబడి అతనిపై దాడి చేసి కత్తితో ఛాతీపై పొడిచాడు. దీంతో మోషే అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం అక్కడ నుంచి నిందితుడు పరార య్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీ లించారు. హతుడి తల్లి మంగమ్మ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కనుపర్తిపాడు జాతీయరహదారి క్రాసు రోడ్డు వద్ద నిందితుడు ఉండగా అరెస్టు చేశాం’ అని వివరించారు. హత్యకు ఉపయోగించిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.  సమావేశంలో సీఐ వెంకటరెడ్డి, ఎస్సై స్వప్న సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-09-25T05:32:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising