తొమ్మిది మద్యం సీసాల స్వాధీనం
ABN, First Publish Date - 2022-12-31T23:25:16+05:30
అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది మద్యం సీసాలను, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సెబ్ ఇన్‌చార్జి సీఐ రవీంద్రబాబు తెలిపారు. శనివారం స్థానిక కార్యాలయంలో ఆయన విలేకరులతో మండలంలోని లిం
ఉదయగిరి రూరల్, డిసెంబరు 31: అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది మద్యం సీసాలను, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సెబ్ ఇన్‌చార్జి సీఐ రవీంద్రబాబు తెలిపారు. శనివారం స్థానిక కార్యాలయంలో ఆయన విలేకరులతో మండలంలోని లింగంనేనిపల్లికి చెందిన మద్దిశెట్టి వెంకటేశ్వర్లు మర్రిపాడు మండలం కృష్ణాపురంలో గల ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్నారని సమాచారం రావడంతో శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించి అతన్ని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అతడి వద్ద ఉన్న తొమ్మిది మద్యం సీసాలను, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆయనకు మద్యం విక్రయించిన సేల్స్‌మన్ మంచాల వెంకటాద్రిని కూడా అరెస్టు చేశామన్నారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ జే.మురళీకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారని పేర్కొన్నారు.
----------
Updated Date - 2022-12-31T23:25:18+05:30 IST