ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్య నిషేధం అమలులో జగన్‌ విఫలం

ABN, First Publish Date - 2022-08-08T02:39:53+05:30

మద్య నిషేధం అమలులో జగన్‌ ప్రభుత్వం విఫలమైందని కందుకూరు నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు దివి సౌభాగ్య

కందుకూరులో నిరసన తెలుపుతున్న తెలుగు మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు మహిళల నిరసన

కందుకూరు, ఆగస్టు 7:  మద్య నిషేధం అమలులో జగన్‌ ప్రభుత్వం విఫలమైందని కందుకూరు నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు దివి సౌభాగ్య విమర్శించారు. మద్యనిషేధం అమలుచేయటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ కందుకూరులో ఆదివారం సాయంత్రం స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం సెంటర్‌లో నిరసన  చేపట్టారు. స్థానిక టీడీపీ కార్యాలయం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం సెంటర్‌ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి అనంతరం అక్కడ కల్తీ లిక్కర్‌ సీసాలను పగులగొట్టి మహిళలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సౌభాగ్య మాట్లాడుతూ ఆడబిడ్డలను మోసం చేసిన జగన్‌ తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో జగన్‌ అధికార పీఠం ఎక్కాక మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుమహిళా రాష్ట్ర నాయకులు శైలజారెడ్డి, విజయతోపాటు నియోజకవర్గంలోని వివిధ మండలాల తెలుగు మహిళా కమిటీల బాధ్యులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-08T02:39:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising