ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మారిన వాతావరణంతో రైతు దిగాలు

ABN, First Publish Date - 2022-01-23T04:16:43+05:30

వారం రోజులుగా మారిన వాతావరణంతో రైతులు దిగులు పడుతున్నారు. రెండునె లల క్రితం కురిసిన భారీ వర్షాలకు బతుకుజీవుడా... అంటూ బయటపడ్డ రైతులు గతవారం కురిసిన వర్షాలకు దిక్కుతోచనిస్ధితికి చేరుకున్నాడు. వరదల అనం

కోవూరులో వరి నాట్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కోవూరు, జనవరి 22 : వారం రోజులుగా మారిన వాతావరణంతో రైతులు దిగులు పడుతున్నారు. రెండునె లల క్రితం కురిసిన భారీ వర్షాలకు బతుకుజీవుడా... అంటూ బయటపడ్డ రైతులు గతవారం కురిసిన వర్షాలకు దిక్కుతోచనిస్ధితికి చేరుకున్నాడు. వరదల అనంతరం నారు పోసి నాట్లేశారు. నాట్లు ఏపుగా పెరుగుతున్న తరుణంలో తిరిగి వర్షాలు కురుస్తుండటం వల్ల వరినాట్లు దెబ్బతింటు న్నాయి. వాతావరణం చలిగా ఉండటం, పగటిపూట ఆకా శం మేఘావృతమై ఉండటం వల్ల నాట్లు దెబ్బతింటున్నా యని వారు వాపోతున్నారు. నియోజకవర్గ పరిధిలోని బుచ్చి, కోవూరు, కొడవలూరు, విడవలూరు, ఇందుకూరుపే ట మండలాల్లోనే కాకుండా సోమశిల రిజర్వాయర్‌ పరిధిలోని కావలి, నెల్లూరు డివిజన్ల పరిధిలో సుమారు ఐదు లక్షల ఎకరాల్లో వరి నాట్లేశారు. పలుచోట్ల అప్పటి వరదలకు నారుమళ్లు దెబ్బతినగా, తిరిగి నారుపోసి నాట్లు వేశారు. నారుమళ్లు  ఏపుగా పెరిగేందుకు రసాయనిక ఎరువులు, యూరియా , దుక్కి పిండి చల్లారు. వర్షపు నీరు పొలంలో నిల్వ ఉండటం, కొన్ని చోట్ల  సారమంతా కొట్టుకుపోవడంతో రైతులు డీలా పడ్డారు. 


 పంట పెరగడం ఆగిపోతుంది

 

గత వారం కురిసిన వర్షం వల్ల వరినాట్లలో నీరు నిలచి పంట పెరగడం ఆగిపోతుంది. ఎండ కూడా తగలనందు వల్ల వరినాట్లకు ఇబ్బంది ఏర్పడింది. 

- గండవరపు వెంకట రమణయ్య, ముదివర్తి


 పెరుగుదల అంతంత మాత్రమే...


 ఇటీవల కురిసన  వర్షం వల్ల ముదరు వరినాట్లు పెరుగుదల అంతంత మాత్రంగానే ఉంది. లేతనాట్లకు పెద్దగా ఇబ్బంది లేదు. మిరప, వంగ, ఆకు కూరల తోటలు బాగా దెబ్బతిన్నాయి. 

-జీ. సంజీవయ్య, గాంధీనగర్‌, ముదివర్తి






Updated Date - 2022-01-23T04:16:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising