ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోక్‌అదాలత్‌లో 333 కేసుల పరిష్కారం

ABN, First Publish Date - 2022-06-27T05:13:27+05:30

స్థానిక సబ్‌కోర్టు, జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో ఆదివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ముఖ్యఅతిఽథులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూరు, జూన్‌ 26 : స్థానిక సబ్‌కోర్టు, జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో ఆదివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ముఖ్యఅతిఽథులుగా సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.రామకృష్ణంరాజు, స్పెషల్‌ మేజిస్ట్రేట్‌ ఎం.రామకృష్ణయ్య పాల్గొని కేసులను విచారించా రు. ఈ క్రమంలో మొత్తం 333 కేసులు రాజీ అయ్యాయి. ఇందులో ఒక సివిల్‌ కేసు, మరొక చెక్‌బౌన్స్‌ కేసు, 28 క్రిమినల్‌ కేసులు, ప్రీ లిటిగేషన్‌ కేసుల్లో 303 మంది రాజీ కుదుర్చుకున్నారు.  ఈ కార్యక్రమంలో లోక్‌ అదాలత్‌ మెంబర్లు ఎం.వెంకటేశ్వర్లు, షేక్‌ సిరాజుద్దీన్‌, పలువురు న్యాయవాదులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

  కందుకూరు: స్థానిక కోర్టు భవనాల సముదాయంలో ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 1862 కేసులు పరిష్కరించారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌.విజయ్‌బాబు ఆధ్వర్యంలో అదాలత్‌ జరిగింది. రెండు బెంచ్‌లు ఏర్పాటుచేయగా ఒక బెంచ్‌కు సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌.విజయ్‌బాబు, మరో బెంచ్‌కు జూనియర్‌ సివిల్‌ జడ్జి జి.వాణిలు ప్రిసైడింగ్‌ అధికారులుగా వ్యవహరించి కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో లోక్‌ అదాలత్‌ సభ్యులైన న్యాయవాదులు బి.వి.శేషయ్య, బి.వెంకటేశ్వర్లు, ఎస్‌.కె.షంషుద్దీన్‌, సిహెచ్‌.మురళీధర్‌, న్యాయవాదులు వలేటి శ్రీధర్‌నాయుడు, కె.హరికోటేశ్వరరావు, సిహెచ్‌ హరికృష్ణ, బి.వి.మురళీకృష్ణ, జె.రాజేంద్రబాబు, వై.సాంబశివరావు  పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-27T05:13:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising