ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుళ్లిన కోడిగుడ్లపై విచారణ

ABN, First Publish Date - 2022-09-15T03:05:04+05:30

భోజన సమయంలో కుళ్లిన కోడిగుడ్లు ఉన్నది వాస్తవమే. కానీ వాటిని పిల్లలకు సరఫరా చేయలేదని నెల్లూరు డిప్యూటి

మనుబోలు బాలుర పాఠశాలలో భోజనం రుచి చూస్తున్న డిప్యూటి డీఈవో భిక్షాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌ 

 మనుబోలు, సెప్టెంబరు 14: భోజన సమయంలో కుళ్లిన కోడిగుడ్లు ఉన్నది వాస్తవమే. కానీ వాటిని పిల్లలకు సరఫరా చేయలేదని నెల్లూరు డిప్యూటి డీఈవో భిక్షాలు తేల్చారు. మధ్యాహ్న భోజనంలో కుళ్లిన కోడిగుడ్లు అంటూ బుధవారం ఆంద్రజ్యోతిలో  కథనం ప్రచురితమైంది. దీనిపై డీఈవో రమేష్‌ స్పందించారు. ఆయన ఆదేశాలతో డిప్యూటి డీఈవో మనుబోలు బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కుళ్లిన కోడిగుడ్లపై విచారణ చేపట్టారు. పిల్లలకు పెడుతున్న భోజనాన్ని రుచి చూశారు. ఉపాధ్యాయులతో, పీఎంసీ కమిటీ చైర్మన్‌తో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుళ్లిన కోడిగుడ్లను పిల్లలకు అందజేయలేదని తెలిపారు.  విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు డేవిడ్‌, పీఎంసీ కమిటీ చైర్మన్‌ సునీత, కో-ఆప్షన్‌ సభ్యుడు అనమాల ప్రభాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-15T03:05:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising