ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కామాక్షితాయికి వైభవంగా కృత్తికా దీపోత్సవం

ABN, First Publish Date - 2022-12-06T23:13:20+05:30

మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలో మంగళవారం కృత్తికాదీపోత్సవం (జ్యోతి) వైభవంగా జరిగింది.

జొన్నవాడ ఆలయంలో వెలిగించిన కృత్తికాదీపోత్సవం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుచ్చిరెడ్డిపాళెం,డిసెంబరు6: మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలో మంగళవారం కృత్తికాదీపోత్సవం (జ్యోతి) వైభవంగా జరిగింది. దీపోత్సవానికి దివంగత కందికట్టు రాజేశ్వరమ్మ మనుమళ్లు ఽకే. ధరణికృష్ణ, శబరికృష్ణ దంపతులు, కామాక్షితాయి పులకాపునకు కందికట్టు భవానమ్మ కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ముందుగా అర్చకులు, పండితులు, పురోహితులు వారి గోత్రనామాలతో పూజలు చేసి అఖండంలో నూనెపోసి (పవిత్ర జ్యోతి)దీపోత్సవాన్ని వెలిగించారు. ఆలయానికి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు ముందుగా స్వామి అమ్మవార్లను దర్శించుకుని కృత్తికదీపోత్సవ అఖండంలో పలు రకాల నూనెలు సమర్పించుకున్నారు. అరుణాచలంలో నిర్వహించే కృత్తికాదీపోత్సవంతోపాటు అదేరోజున జొన్నవాడ ఆలయంలోనూ 80 ఏళ్లకు పూర్వ నుంచి ఈ ఉభయకర్తల కుటుంబాలు కృత్తికా దీపోత్సవం నిర్వహించడం విశేషం. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ పుట్టా సుబ్రహ్మణ్యంనాయుడు, ఈవో డబ్బుగుంట వెంకటేశ్వర్లు, సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:13:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising