లంచం అడిగితే సస్పెండ్ చేయిస్తా
ABN, First Publish Date - 2022-03-06T03:19:45+05:30
కొందరు అధికారులు తన పేరు చెప్పి లంచాలు అడుగుతున్నారన్న ప్రచారం జరుగుతోందని అలాంటి చర్యలు పాల్పడే వారిని ఉపేక్షించనని, సస్పెండ్ చేయిస్తానని కావలి ఎమ్మెల్యే ప్రతా్‌పకుమార్‌రెడ్డి హెచ్చరించారు.
అధికారులకు ఎమ్మెల్యే ప్రతా్‌పకుమార్‌రెడ్డి హెచ్చరిక
కావలి, మార్చి 5: కొందరు అధికారులు తన పేరు చెప్పి లంచాలు అడుగుతున్నారన్న ప్రచారం జరుగుతోందని అలాంటి చర్యలు పాల్పడే వారిని ఉపేక్షించనని, సస్పెండ్ చేయిస్తానని కావలి ఎమ్మెల్యే ప్రతా్‌పకుమార్‌రెడ్డి హెచ్చరించారు. డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా శనివారం కావలి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆర్డీవో శీనానాయక్ సమక్షంలో ఎమ్మెల్యే లంచాలు గురించి మాట్లాడటం కావలిలో సంచలనం కలిగించింది. తన పేరు చెప్పి కానీ, ఏ పనికైనా లంచాలు అడిగితే తన దృష్టికి తేవాలన్నారు. లంచం అడిగిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు వారి పనిని చేయిస్తానన్నారు. అలాగే కావలిలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, గుంతలు, పార్కులు, కాలువలు ఇతరత్రా స్థలాలు ఆక్రమించుకుంటున్నారని ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలు తగిన ఆధారాలతో తన దృష్టికి తెస్తే పార్టీలతో సంబంధం లేకుండా వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం సమస్యల పరిస్కారానికి చక్కని వేదికైందన్నారు.
Updated Date - 2022-03-06T03:19:45+05:30 IST