కర్ణాటక మద్యం, రూ.14.5లక్షల నగదు పట్టివేత
ABN, First Publish Date - 2022-10-18T03:12:21+05:30
ఇంటెలిజెన్స్ అధికారుల టోల్‌ఫ్రీ నెంబరు 15400కి వచ్చిన సమాచారంతో మండలంలోని కృష్ణాపురం టోల్‌ప్లాజా వద్ద ఇంటెలిజె
మర్రిపాడు, అక్టోబరు 17 : ఇంటెలిజెన్స్ అధికారుల టోల్‌ఫ్రీ నెంబరు 15400కి వచ్చిన సమాచారంతో మండలంలోని కృష్ణాపురం టోల్‌ప్లాజా వద్ద ఇంటెలిజెన్స్ టీమ్, సెబ్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో బెంగళూరు నుంచి కందుకూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సరైన పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న రూ. 14.5లక్షల నగదును. బెంగళూరు నుంచి పామూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో 14 కర్ణాటక మద్యం సీసాలను పట్టుకున్నారు. నగదును మాత్రం మర్రిపాడు పోలీస్‌స్టేషన్‌లో అప్పగించామని ఉదయగిరి ఇంటెలిజెన్స్ సీఐ నరహరి సోమవారం తెలిపారు. ఈ తనిఖీల్లో తనతోపాటు ఇన్‌చార్జి సెబ్ సీఐ కిరణ్‌కుమార్, వారి సిబ్బంది పాల్గొన్నారని ఆయన తెలిపారు.
Updated Date - 2022-10-18T03:12:21+05:30 IST