ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కందుకూరుకే తలమానికం ఎంఐజీ లేఅవుట్‌

ABN, First Publish Date - 2022-11-02T22:32:26+05:30

కందుకూరుకే తలమానికం ఎంఐజీ లేఅవుట్‌ కందుకూరు, నవంబరు2: సకల సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంతో సిద్ధమవుతున్న ఎంఐజీ లేఅవుట్‌ కందుకూరుకే తలమానికమని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి అన్నారు. మున్సిపల్‌ పురపాలక సంఘం కార్యాలయంలో ఎంఐజీ లేఅవుట్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన 32 మందికి లాటరీ పద్ధతిలో ప్లాట్ల ధ్రువపత్రాలను బుధవారం అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్‌ లేఅవుట్‌ను ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తొలుత ఎంఐజీ లేఅవుట్‌కు కందుకూరుకు అవకాశం కల్పించారని గుర్తు చేశారు. అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ, చక్కటి గ్రీనరీ, విశాలమైన పార్కు, కళ్యాణ మండపం అభివృద్ధి చేస్తామన్నారు. పక్కనే స్విమ్మింగ్‌ పూల్‌ ఉన్నందున ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడిందన్నారు. పట్టణంలో కేవలం రెండు లేఅవుట్లుకు మాత్రమే పర్మిషన్‌ ఉందని గుర్తు చేశారు. కొన్ని ఏరియాల్లో ఆరడుగుల రోడ్లు కూడా ఉన్నాయని ప్రస్తుతం ఉన్న వాటిని అలాగే ఉంచి ఇకనుంచి నిర్మించబోయే నూతన గృహాల నిర్మాణదారులు ముందు భాగం వైపు కనీసం 30 అడుగుల రోడ్డు చూపించాలని చెప్పారు. కార్యక్రమంలో ఓనుడా వైస్‌ చైర్మన్‌ నిరంజన్‌ రెడ్డి, పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌ఈ గోపాల్‌ రెడ్డి, ఓనుడా టౌన్‌ప్లానింగ్‌ అధికారిణి హిమబిందు, ఇన్‌చార్జ్‌ మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీరామమూర్తి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరుకే తలమానికం ఎంఐజీ లేఅవుట్‌

కందుకూరు, నవంబరు2: సకల సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంతో సిద్ధమవుతున్న ఎంఐజీ లేఅవుట్‌ కందుకూరుకే తలమానికమని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి అన్నారు. మున్సిపల్‌ పురపాలక సంఘం కార్యాలయంలో ఎంఐజీ లేఅవుట్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన 32 మందికి లాటరీ పద్ధతిలో ప్లాట్ల ధ్రువపత్రాలను బుధవారం అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్‌ లేఅవుట్‌ను ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తొలుత ఎంఐజీ లేఅవుట్‌కు కందుకూరుకు అవకాశం కల్పించారని గుర్తు చేశారు. అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ, చక్కటి గ్రీనరీ, విశాలమైన పార్కు, కళ్యాణ మండపం అభివృద్ధి చేస్తామన్నారు. పక్కనే స్విమ్మింగ్‌ పూల్‌ ఉన్నందున ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడిందన్నారు. పట్టణంలో కేవలం రెండు లేఅవుట్లుకు మాత్రమే పర్మిషన్‌ ఉందని గుర్తు చేశారు. కొన్ని ఏరియాల్లో ఆరడుగుల రోడ్లు కూడా ఉన్నాయని ప్రస్తుతం ఉన్న వాటిని అలాగే ఉంచి ఇకనుంచి నిర్మించబోయే నూతన గృహాల నిర్మాణదారులు ముందు భాగం వైపు కనీసం 30 అడుగుల రోడ్డు చూపించాలని చెప్పారు. కార్యక్రమంలో ఓనుడా వైస్‌ చైర్మన్‌ నిరంజన్‌ రెడ్డి, పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌ఈ గోపాల్‌ రెడ్డి, ఓనుడా టౌన్‌ప్లానింగ్‌ అధికారిణి హిమబిందు, ఇన్‌చార్జ్‌ మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీరామమూర్తి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-02T22:32:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising