ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నైపుణ్యాలను తీర్చిదిద్దడానికే కమ్యూనిటీ సర్వీస్‌ ప్రాజెక్ట్‌

ABN, First Publish Date - 2022-09-18T03:49:33+05:30

విద్యార్థుల్లో నైపుణ్యాలను తీర్చిదిద్దడం కోసమే డిగ్రీ విద్యార్థులకు ఇంటెన్షిప్‌, కమ్యూనిటీ సర్వీస్‌ ప్రాజెక్టును ప్రవేశపెట్టామని రాష్ట్ర ఉన్నత వి

సెమినార్‌ హాల్‌ను ప్రారంభిస్తున్న హేమచంద్రారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటాచలం, సెప్టెంబరు 17:  విద్యార్థుల్లో నైపుణ్యాలను తీర్చిదిద్దడం కోసమే డిగ్రీ విద్యార్థులకు ఇంటెన్షిప్‌, కమ్యూనిటీ సర్వీస్‌ ప్రాజెక్టును ప్రవేశపెట్టామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి తెలిపారు. మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న వీఎస్‌యూలో శనివారం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన డిజిటల్‌ లైబ్రరీని, అనంతరం ఆధునీకికరించిన సీవీ రామన్‌ సెమినార్‌ హాల్‌ను ప్రారంభించారు. అనంతరం అమృత్‌ మహోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిభిరాన్ని  వీసీ సుందరవల్లితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిగ్రీ విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. అనంతరం జాతీయ విద్యావిధానంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ప్రసంగించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనల మేరకు చేపట్టిన కార్యక్రమం ద్వారా విద్యార్థులు నైపుణ్యతను పొంది మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందాలన్నారు.  వీసీ సుందరవల్లి  తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ రామచంద్రారెడ్డి, డీన్‌ డాక్టర్‌ సీహెచ్‌ విజయ, వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌ విజయానంద్‌కుమార్‌ బాబు, ఎన్‌ఎస్‌ఎస్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ అల్లం ఉదయ్‌ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-18T03:49:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising