ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధుకైటభ వధ అలంకారంలో కామాక్షితాయి

ABN, First Publish Date - 2022-09-30T04:51:55+05:30

దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలో కామాక్షితాయి మధుకైటభ వధ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

మధుకైటభ వధ అలంకారంలో దర్శనమిస్తున్న కామాక్షితాయి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుచ్చిరెడ్డిపాళెం, సెప్టెంబరు29: దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలో కామాక్షితాయి మధుకైటభ వధ  అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం పుణ్యాహవచనం, కలశపూజ చేశారు. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో నవావరణ పూజలు నిర్వహించారు. రాత్రి అమ్మవారికి కాళరాత్రి మహానవావరణ పూజలు చేసి కొలువు నిర్వహించారు. ఈకార్యక్రమానికి నెల్లూరుకు చెందిన దోనెపర్తి నరసింహారావు కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. వల్లూరు రవీంద్రారెడ్డి, పెద్ద కామాక్షమ్మ భక్తులకు అన్నదానం చేశారు. అనంతరం అమ్మవారికి జరిగిన సామూహిక కుంకుమార్చన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్‌ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యంనాయుడు, సభ్యులు, ఏసీ, ఈవో డబ్బుగుంట వెంకటేశ్వర్లు ఉత్సవాలను పర్యవేక్షించారు. శుక్రవారం కామాక్షితాయి రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

లక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు కనకదుర్గమ్మ దర్శనం

 స్థానిక దుర్గానగర్‌లో కొలువైవున్న కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారు లక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దాతల సహకారంతో ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు, సాయంత్రం సామూహిక కుంకుమార్చన అనంతరం పల్లకిసేవ వైభవంగా నిర్వహించారు. బుచ్చి పెద్దూరులోని కోదండరామస్వామి ఆలయంలో కోదండరాముడు వేణుగోపాలస్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక కన్యకాపరమేశ్వరి , రామకృష్ణానగర్‌లోని కల్యాణ వేంకటేశ్వరస్వామి, బాబా మందిరం, రేబాలలోని పుట్టాలమ్మ ఆలయాల్లో నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.

తోటపల్లిగూడూరు : మండలంలోని సౌత్‌ఆములూరులో  ఉన్న శ్రీఆములూరు అమ్మవారు  ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. టీడీపీ సీనియర్‌ నాయకులు గోపాల్‌నాయుడు ఉభయకర్తగా వ్యవహరించారు.






Updated Date - 2022-09-30T04:51:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising