ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జెన్‌కో కార్మికులను వీధిన పడేసిన జగన్‌

ABN, First Publish Date - 2022-07-05T03:24:20+05:30

జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం కాంట్రాక్టు కార్మికులను సీఎం జగన్‌ వీధిన పడేశారని జెన్‌కో కాంట్రాక్టు కార్మికుల ఐక్యవేదిక నా

ఆందోళన చేస్తున్న జెన్‌కో కార్మికులు, ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముత్తుకూరు, జూలై4: జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం కాంట్రాక్టు కార్మికులను సీఎం జగన్‌ వీధిన పడేశారని జెన్‌కో కాంట్రాక్టు కార్మికుల ఐక్యవేదిక నాయకులు పేర్కొన్నారు. సోమవారం నేలటూరు జెన్‌కో థర్మల్‌ కేంద్రం వద్ద జెన్‌కో ఉద్యోగులు, కార్మికులు అందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ థర్మల్‌ కేంద్రం నిర్మాణ సమయంలో భూములు కోల్పోయిన కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని జగన్‌ హామీ ఇచ్చారన్నారు. నేటీకీ ఆ హామీ అమలుకు నోచుకోలేదన్నారు. కంటితుడుపుగా కొందరికి కాంట్రాక్టు కార్మికులుగా అవకాశం కల్పించార న్నారు. తెలంగాణా సీఎం కేసీఆర్‌ కాంట్రాక్టు కార్మికులకు పూలబాట వేస్తుంటే, ఆంధ్ర సీఎం జగన్‌ కార్మికులను రోడ్డుపై పడేశారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ తొందరపాటు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని, ప్రైవేటీకరణ ను రద్దు చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో జెన్‌కో కాంట్రాక్టు కార్మికుల ఐక్యవేదిక జేఏసీ నాయకులు, జెన్‌కో ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-05T03:24:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising