ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి కామాక్షితాయి బ్రహ్మోత్సవాలు

ABN, First Publish Date - 2022-05-21T05:37:47+05:30

జొన్నవాడ మల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయ బ్రహోత్సవాలు శనివారం ప్రారంభం కానున్నాయి.

విద్యుద్దీప వెలుగుల్లో కామాక్షితాయి ఆలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

29న రథోత్సవం, 30న స్వామి అమ్మవార్ల కల్యాణం


బుచ్చిరెడ్డిపాళెం, మే 20 : జొన్నవాడ మల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయ బ్రహోత్సవాలు శనివారం ప్రారంభం కానున్నాయి. రాత్రి అంకురార్పణతో మొదలయ్యే ఉత్సవాలు 22న ధ్వజారోహణం, 23 శేషవాహనం, 24న పురుషామృగ వాహనం, 25న సింహవాహనం, 26న హంసవాహనం, 27న రావణ సేవ, 28న పెద్ద వెండి నంది సేవ, 29న రథోత్సవం, 30న ఉదయం  స్వామి, అమ్మవార్ల కల్యాణం, 31న ఉదయం ధ్వజావరోహణం, రాత్రి అశ్వవాహనము, ఏకాంతసేవతో ముగుస్తాయి. తరలివచ్చే భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.  అమ్మవారి ఆలయం, ప్రధాన కూడళ్లు, రహదారి వెంబడి ఏర్పాటు చేసిన విద్యుద్దీప అలంకరణ ఆకట్టుకుంటోంది. బ్రహోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారుల సహకారంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు చైర్మన్‌ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు. ఆలయ ఈవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేవదాయ శాఖ అధికారుల సూచనలు, పాలకమండలి, దాతల సహకారంతో భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-05-21T05:37:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising