ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగనన్న లేఅవుట్‌లో జేసీ పరిశీలన

ABN, First Publish Date - 2022-01-28T03:15:13+05:30

వెంకటగిరి - తిరుపతి మార్గంలో ఏర్పాటు చేసిన జగనన్న లేఅవుట్‌ను గురువారం జేసీ గణేష్‌, డీఆర్‌డీఏ పీడీ సాంబశివారెడ్డితో కలిసి సందర్శించారు.

జగనన్న ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడుతున్న జేసీ గణేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారులు సహకరించడం లేదని లబ్ధిదారుల ఫిర్యాదు

వెంకటగిరి, జనవరి 27: వెంకటగిరి - తిరుపతి  మార్గంలో ఏర్పాటు చేసిన జగనన్న లేఅవుట్‌ను గురువారం జేసీ గణేష్‌, డీఆర్‌డీఏ పీడీ సాంబశివారెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు ఆయనను కలిశారు. ఇళ్ల నిర్మాణాల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు అధికారులు సహకరించడంలేదని ఫిర్యాదు చేశారు. లేఔట్‌ విద్యుత్‌, నీటి సరఫరా కల్పించలేదని, ఈ సమస్యలను స్థానిక అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా పరిష్కరించడం లేదని ఆరోపించారు. అధిక ధరలకు బయటి ప్రాంతాల నుంచి తెచ్చుకుంటున్న గ్రావెల్‌ పోలీసులు పెద్ద మొత్తాల్లో పెనాట్లీలు వేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన ఆయన ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ఇళ్ళ నిర్మాణాలకు ప్రస్తుతం ఇస్తున్న రూ 1.80 లక్షలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయమై శుక్రవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించ నున్నట్లు తెలిపారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు.


Updated Date - 2022-01-28T03:15:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising