ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టణమా.. కంపోస్టు యార్డా?

ABN, First Publish Date - 2022-03-06T03:44:57+05:30

వెంకటగిరి పట్టణమా.. కంపోస్టు యార్డా అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంగోటి నాగేశ్వరరావు విమర్శించారు.

రోడ్డు పై పేరుకు పోయిన చెత్తను పరిశీలిస్తున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంగోటి నాగేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- గంగోటి నాగేశ్వరరావు

వెంకటగిరి, మార్చి 5: వెంకటగిరి పట్టణమా.. కంపోస్టు యార్డా అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంగోటి నాగేశ్వరరావు విమర్శించారు. శనివారం పట్టణ పరిధిలోని 15వ వార్డు, రూరల్‌ పరిధిలోని సిద్దవరం, పారవోలు గ్రామాల్లో నిర్వహించిన గౌరవ సభల్లో ఆయన మాట్లాడారు. పట్టించుకొనే నాథులు లేక పట్టణం కంపోస్టు యార్డులా తయారైం దన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇస్తానన్న జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించి రైతుల ఉసురు తీస్తున్నాడని ఆరోపించారు. వెంకటగిరి నియోజకవర్గంలో అభివృద్ది జరిగిందంటే అది  టీడీపీ హయంలోనేనని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపే చంద్రబాబునాయుడుకి పట్టంకట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు శ్రీరామదాసు గంగాధర్‌, టీడీపీ రూరల్‌ అధ్యక్షులు పప్పు చంద్రమౌళి రెడ్డి, నాయకులు పులికొల్లు రాజేశ్వరరావు, కేవీకే ప్రసాద్‌ నాయుడు, కాపా శ్రీనివాసుల నాయుడు, టీవీఆర్‌, గెరిట చెంచయ్య, తాండవచంద్ర, నాగరాజు, బాబు తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2022-03-06T03:44:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising