ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ఇంటికి అదనంగా రూ. 15వేలు ఇస్తా..

ABN, First Publish Date - 2022-07-04T05:05:09+05:30

ప్రతి ఇంటికి ప్రభుత్వం ఇచ్చే డబ్బు కాకుండా అదనంగా తన సొంత నిధులు ఒక్కో ఇంటికి రూ. 15వేలు ఇస్తానని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి రాజవోలుపాడు గిరిజనులకు హామీ ఇచ్చారు.

రాజవోలుపాడులో గిరిజనులతో మాట్లాడుతున్న మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిరిజనులకు మంత్రి కాకాణి హామీ

 మనుబోలు, జూలై 3: ప్రతి ఇంటికి ప్రభుత్వం ఇచ్చే డబ్బు కాకుండా అదనంగా తన  సొంత నిధులు ఒక్కో ఇంటికి రూ. 15వేలు ఇస్తానని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి రాజవోలుపాడు గిరిజనులకు హామీ ఇచ్చారు. ఆదివారం రెండో రోజు మండలంలోని వీరంపల్లి పంచాయతీలోని రాజవోలుపాడు, మడ గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కొనసాగింది. రాజవోలుపాడు గ్రామంలో గిరిజనులు తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, ఒక్కో ఇంట్లో రెండేసి కాపురాలు ఉంటున్నామని, వర్షాకాలంలో గుడిసెల చుట్టూ నీరు చేరి ఇబ్బందులు పడుతున్నామని మంత్రి ముందు గిరిజనులు వాపోయారు. దీంతో మంత్రి  స్పందించి అధికారులతో ఇళ్ల సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. ఆక్రమణలో ఉన్న గిరిజనుల ఇళ్లస్థలాన్ని ఖాళీ చేయించి,  కాలనీలో ఉన్న 23మంది గిరిజన కుటుంబాలకు మూడునెలల్లోగా ప్రభుత్వం తరపున అధికారులు ఇళ్లు కట్టించి ఇస్తారని, రూ.1.80లక్షలు కాకుండా, తాను ఒక్కో ఇంటికి రూ. 15వేలు అదనంగా ఇస్తానని గిరిజనులకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ నాగరాజు, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, కార్యదర్శి రాజేశ్వరి, వీఆర్‌వో భక్తవత్సల రెడ్డి, ఏఏబీ ఛైర్మన్‌జెట్టి సురేంద్రరెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-04T05:05:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising