ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2022-05-21T04:17:44+05:30

ప్రధానమంత్రి అవాస్‌ యోజన పథకం కింద 2021-22 సంవత్సరంలో మంజూరైన గృహాలను లబ్ధిదారులు త్వరితగతిన పూర్తి చేసేలా సిబ్బంది చర్యలు చేపట్టాలని గృహ నిర్మాణ శాఖ ఇన్‌చార్జి పీడీ పీ.నరసింహం తెలిపారు.

సిబ్బందితో సమీక్షిస్తున్న పీడీ నరసింహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇన్‌చార్జి పీడీ నరసింహం

ఉదయగిరి రూరల్‌, మే 20: ప్రధానమంత్రి అవాస్‌ యోజన పథకం కింద 2021-22  సంవత్సరంలో మంజూరైన గృహాలను లబ్ధిదారులు త్వరితగతిన పూర్తి చేసేలా సిబ్బంది చర్యలు చేపట్టాలని గృహ నిర్మాణ శాఖ ఇన్‌చార్జి పీడీ పీ.నరసింహం తెలిపారు. శుక్రవారం స్థానిక స్త్రీశక్తి భవనంలో హౌసింగ్‌ సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం కింది జిల్లాలో 10,593 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. వీటి నిర్మాణం పూర్తి చేయించేందుకు ఈనెల 10 నుంచి 17వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల వివరాలు, ఇంటి హద్దులను నమోదు చేస్తామన్నారు.  తొలుత ఆయన మండలాల వారీగా ఏఈలు, వర్కుఇన్‌స్పెక్టర్లతో సమీక్షించారు. కొందరు సక్రమంగా వివరాలు నమోదు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీఈ శ్రీనివాసులు, ఏఈలు రామకృష్ణ, రాజారావు, ప్రసాద్‌, భార్గవ్‌రావు, ఎంఐసీ మహేష్‌, వర్కుఇన్‌స్పెక్టర్లు హర్ష, నాయబ్‌, పోలయ్య, చెన్నరాయుడు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-21T04:17:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising