ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్య శాఖ పోస్టుల భర్తీలో నకిలీ సర్టిఫికెట్ల కలకలం

ABN, First Publish Date - 2022-09-30T04:38:23+05:30

వైద్య శాఖ పరిధిలో ఖాళీ పోస్టు భర్తీలో అభ్యర్థులు దాఖలు చేసిన సర్టిఫికెట్లలో భారీగా నకిలీవి బయటపడ్డాయి.

నకిలీ సర్టిఫికెట్లు అందజేసిన దరఖాస్తుదారుడిని ప్రశ్నిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెన్త మార్కుల జాబితాలో తేడా

ఇంటర్వ్యూలో గుర్తించిన అధికారులు

విచారణలో ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.45 వేల వరకు ఇచ్చినట్టు సమాచారం

నెల్లూరు, కావలి, గూడూరులలో తీసుకున్నట్టు వెల్లడి


నెల్లూరు (వైద్యం), సెప్టెంబరు 29 : వైద్య శాఖ పరిధిలో ఖాళీ పోస్టు భర్తీలో అభ్యర్థులు దాఖలు చేసిన సర్టిఫికెట్లలో భారీగా నకిలీవి బయటపడ్డాయి. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, వైద్య ఆరోగ్య శాఖ, వైద్య విధాన పరిషతలలో 81 ఖాళీల భర్తీకి ఈ నెల 15వ తేదీన నోటిఫికేషన జారీ చేశారు. జనరల్‌ డ్యూటీ అటెండెంట్‌, ఆఫీసు సబార్డినేట్‌ పోస్టులకు పదవ తరగతి అర్హతతో దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ రెండు విభాగాల్లో 43 పోస్టులకు 700 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఈ నెల 20వ తేదీన మూడు రోజులపాటు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరిగాయి. డీఎంహెచవో పెంచలయ్య, జీజీహెచ సూపరింటెండెంట్‌ సిద్దానాయక్‌, డీసీహెచఎ్‌స రవీంద్రనాథ్‌లు అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించారు. జనరల్‌ డ్యూటీ అటెండెంట్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌ పూర్తిస్థాయి మెరిట్‌ జాబితా రూపొందించిన అధికారులు 130 మందిని ఎంపిక చేశారు. వీరిని 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలిచిన వైద్యాధికారులు 45 మంది మార్కుల లిస్టులు నకిలీవని తేల్చారు. సర్టిఫికెట్‌లో 296 మార్కులు ఉండగా నకిలీలు 496 ఉన్నట్టు గుర్తించారు. దీంతో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం బయట పడింది. దీంతో ఖంగుతిన్న అభ్యర్థులు తమ టెన్త సర్టిఫికెట్లు అసలువేనని వాదించడానికి ప్రయత్నించారు. అయితే అధికారులు తీవ్ర హెచ్చరికలు చేశారు. మరోసారి నకిలీ సర్టిఫికెట్లు దరఖాస్తులో నమోదు చేస్తే పోలీసు కేసు పెడతామని హెచ్చరించడంతో అభ్యర్థులు వెనుతిరిగారు. ఒక్కో టెన్త మార్కుల లిస్టుకు రూ.35 వేల నుంచి రూ.45వేల వరకు అభ్యర్థులు ఖర్చు చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. నెల్లూరునగరంతోపాటు గూడూరు, కావలి తదితర ప్రాంతాలలో ఈ సర్టిఫికెట్లు తీసుకున్నట్లు అభ్యర్థులు తెలిపారు. నకిలీ సర్టిఫికెట్లు తీసుకుని భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని డీఎంహెచవో పెంచలయ్య సూచించారు. 

Updated Date - 2022-09-30T04:38:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising