ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరాలి

ABN, First Publish Date - 2022-08-08T02:47:30+05:30

ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగురవేయడం భారతీయులు బాధ్యతని ఎమ్మెల్యే ప్రతా్‌పకుమార్‌ రెడ్డి అన్నారు.

ర్యాలీలో ఎమ్మెల్యే రామిరెడ్డి, ఆర్డీవో శీనానాయక్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్టణంలో ఉత్సాహంగా ర్యాలీ

కావలిటౌన్‌, ఆగస్టు 7: ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగురవేయడం భారతీయులు బాధ్యతని ఎమ్మెల్యే ప్రతా్‌పకుమార్‌ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి ఎంపీడీవో సుబ్బారావు పర్యవేక్షణలో జరిగిన హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ర్యాలీలో విద్యార్థుల దేశ నాయకుల వేషాధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో ఆర్డీవో శీనానాయక్‌, తహసీల్దార్‌ మాధవరెడ్డి, సీఐ మల్లికార్జున్‌రావు, కేతిరెడ్డి శివకుమార్‌ రెడ్డి, మాలకొండారెడ్డి, స్వచ్చంద సేవాసంస్ధల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

కొండాపురం : హర్‌ ఘర్‌ తిరంగాలో భాగంగా ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరాలని జడ్పీటీసీ యల్లావుల వెంకటరావు అన్నారు. ఆదివారం సాయిపేట గ్రామంలో ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ ర్యాలీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చెన్నకేశవులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, విద్యార్ధులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

ఉదయగిరి : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయగిరిలో ర్యాలీ నిర్వహించారు. సర్పంచు సామ్రాజ్యం ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది, వలంటీర్లు బస్టాండు వరకు ర్యాలీ చేపట్టి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచు ముర్తుజాహుస్సేన్‌, ఉపాధ్యాయుడు యస్ధాన్‌, వైసీపీ నాయకులు ఉప్పుటూరి శ్రీనివాసులు, గడియాల్చి యస్ధాన్‌, జబీ, అనిల్‌, డిజిటల్‌ అసిస్టెంట్‌ నారాయణ, జూనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-08T02:47:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising