ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గురుకులంలో చెట్ల విక్రయం

ABN, First Publish Date - 2022-08-31T02:42:22+05:30

చెట్లు మానవాళి ప్రగతికి మెట్లు... అని పదిమందికి తెలియచెప్పాల్సిన ఓ ప్రిన్సిపాల్‌ కాసులకు కక్కుర్తిపడి 20 ఏళ్లనాటి భారీ వృక్షా

గురుకులంలో చెట్లను నరకగా మిగిలిన మోడులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 20 ఏళ్లనాటి భారీ వృక్షాల నరికివేత

 రాత్రికిరాత్రే తరలింపు

 మండిపడుతున్న ప్రకృతి ప్రేమికులు

గురుకులంలో చెట్లను నరకగా మిగిలిన మోడులు

సంగం, ఆగస్టు 30: చెట్లు మానవాళి ప్రగతికి మెట్లు... అని పదిమందికి తెలియచెప్పాల్సిన ఓ ప్రిన్సిపాల్‌ కాసులకు కక్కుర్తిపడి 20 ఏళ్లనాటి భారీ వృక్షాలను  నరికించి  సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విషయం బహిర్గతం కావడంతో ఆయన తన తప్పును కప్పి పుచ్చుకునేందుకు రహదారికి అడ్డంగా ఉన్నాయని ఫిర్యాదు  అందడంతో చెట్లు తొలగించామని బుకాయించారు. ఈ సంఽఘటన సంగంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో జరిగింది.  సంగం తిరుమనతిప్పలో 20 ఏళ్ల కిందట సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన ఆశ్రమ బాలికల గురుకుల కళాశాలను నిర్మించారు.  ప్రారంభ సమయంలో ఆవరణం చుట్టూ అప్పటి ప్రిన్సిపాల్‌ మొక్కలు నాటించారు. అవి వేపుగా పెరిగి పెద్దవయ్యాయి. తుఫాన్ల సమయంలో గాలివానకు చెట్లు పడిపోకుండా గతంలో పనిచేసిన ప్రిన్సిపాల్స్‌ కొమ్మలు నరికించేవారు.దీంతో ఇవి ఎంతో ఆహ్లాదంగా ఉండేవి. 


 భారీ వృక్షాల నరికివేత


ప్రస్తుత ప్రిన్సిపాల్‌ కొమ్మలు కొట్టిస్తే కూలీలకు ఖర్చులవుతాయని, కాసులకు కక్కుర్తిపడి ఏకంగా ఆ వృక్షాలను ఓ సామిల్లుకు విక్రయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సామిల్లు నిర్వాహకులు ఆది, సోమవారాల్లో భారీ వృక్షాలను మొదళ్లకాడకి నరికి  తరలించారు.  ఇదేమిటని  వారిని ప్రశ్నించడంతో ఆలయానికి వెళ్లే రహదారికి అడ్డంగా ఉన్నాయని, చెట్లన్నీ తొలగించాలని ప్రిన్సిపాల్‌ చెప్పినట్లు తెలిపారు. రాత్రిరాత్రికే వృక్షాలను తరలించడంతో ప్రిన్సిపాల్‌ తీరుపై  ప్రకృతి ప్రేమికులు మండిపడుతున్నారు. చెట్ల నరికిస్తే తమను చూడనొచ్చే తల్లిదండ్రులు ఎక్కడ కూర్చొవాలని కళాశాల విద్యార్థునిలు ఉపాధ్యాయులను నిలదీశారని విశ్వసనీయ సమాచారం. ఈ విషయంపై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరడానికి ప్రయత్నించగా అందుబాటులో లేరు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి భారీ వృక్షాల నరికివేతపై విచారించాలని పలువురు కోరుతున్నారు.


Updated Date - 2022-08-31T02:42:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising