తీర గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన
ABN, First Publish Date - 2022-02-02T03:56:06+05:30
మండలంలోని సముద్రతీర ప్రాంత గ్రామాలైన రాయిగుంటపాళెం, నిడుగుర్తిపంచాయతీ వేణుగోపాలపురం గ్రామాల్లో మంగళవారం గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్‌రావు పర్యటించారు.
వాకాడు, ఫిబ్రవరి 1 : మండలంలోని సముద్రతీర ప్రాంత గ్రామాలైన రాయిగుంటపాళెం, నిడుగుర్తిపంచాయతీ వేణుగోపాలపురం గ్రామాల్లో మంగళవారం గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్‌రావు పర్యటించారు. వ్యవసాయ మండల చైర్మన్ దువ్వూరు అజిత్‌కుమార్‌రెడ్డిని కలిసి వరిపంట సంరక్షణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న రావిగుంటపాళెం సర్పంచ్ దేవారెడ్డి సురేంద్రరెడ్డిని పరామర్శించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నిడిగుర్తిపంచాయతీ వేణుగోపాలపురంలో సీసీ రోడ్ల పనితీరు, డ్రైనేజీని పరిశీలించారు. విషజ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పెల్లూరు కోటిరెడ్డి, రవిరెడ్డి, ప్రదీప్‌రెడ్డి, కోటా రమేష్, రాయపు రవీంద్ర ఉన్నారు.
Updated Date - 2022-02-02T03:56:06+05:30 IST