ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐదు రోజుల్లో గూడు సాధ్యమేనా!?

ABN, First Publish Date - 2022-12-16T00:22:02+05:30

అంతన్నారు.. ఇంతన్నారు.. ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు.. తీరా ఆచరణలో చేతులేత్తేశారు.. ఇదీ జిల్లాలో జగనన్న ఇళ్ల నిర్మాణాల పరిస్థితి. జిల్లాకు 58,041 ఇళ్లను మంజూరు చేస్తే మూడేళ్లలో నిర్మించిన ఇళ్ల సంఖ్య అక్షరాల 4402. ఈ నెల 21న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా సామూహిక గృహ ప్రవేశాలు జరపాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఆ మేరకు జిల్లాలో కనీసం 13,500 ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా విధించారు. కానీ ఆ లక్ష్యానికి జిల్లా ఆమడ దూరంలో నిలిచింది. మిగిలిన ఐదు రోజుల్లో కనీసం సగం లక్ష్యాన్ని అయినా చేరుకున్నా గొప్పే అన్నట్లుగా పరిస్థితి తయారైంది.

నెల్లూరు నగర పరిధిలోని అక్కచెరువుపాడులోని జగనన్న కాలనీలో మందకొడిగా సాగుతున్న ఇళ్ల నిర్మాణాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

21న సామూహిక గృహ ప్రవేశాలకు ఏర్పాట్లు

లక్ష్యం 13,500 ఇళ్లు.. పూర్తయ్యింది 4402

ఫలితమివ్వని ప్రభుత్వ విధానం

నెల్లూరు, డిసెంబర్‌ 15 (ఆంధ్రజ్యోతి) : ‘‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’’ పథకం కింద జిల్లాలో 277 లేఅవుట్లు వేసి 72,062 ప్లాట్లు ఏర్పాటు చేశారు. వీటిలో నుడా పరిధిలోని స్థలాల్లో మాత్రమే తొలుత 58,041 ఇళ్లను మంజూరు చేశారు. అందులో సొంత స్థలాల్లో నిర్మించుకునే ఇళ్లు సుమారు 13,500 వరకు ఉన్నాయి. తొలుత ప్రభుత్వం తామే సొంతంగా పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించింది. అయితే, కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ఆ భారం లబ్ధిదారులపైనే నెట్టేశారు. ప్రభుత్వం ఇస్తున్న రూ.1.80 లక్షలు ఇంటి నిర్మాణానికి సరిపోకపోవడంతో అనేక మంది ఆసక్తి చూపలేదు. ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి దారుణంగా ఉండటంతో కొందరు కాంట్రాక్టర్ల చేత బలవంతంగా ఇళ్ల నిర్మాణాలు మొదలుపెట్టించారు. అయితే వారిలో చాలా మంది అర్ధంతరంగా పనులు ఆపేసి వెళ్లిపోవడం గమనార్హం. ఈ నెల 13వ తేదీ నాటికి జిల్లాలో 55,954 ఇళ్ల నిర్మాణాలు మొదలైనట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. అందులో బేస్‌ లెవల్‌ కన్నా తక్కువ స్థాయిలో ఉన్న నిర్మాణాలు 27,980 కాగా బేస్‌ లెవల్‌లో ఉన్నవి 18,449. రూఫ్‌ లెవల్‌లో 2232 నిర్మాణాలు ఉండగా రూఫ్‌ కాస్ట్‌ లెవల్‌లో 2891 నిర్మాణాలు ఉన్నాయి. అప్పటివరకు పూర్తయిన ఇళ్ల సంఖ్య 4402 మాత్రమే. జిల్లాలో మొత్తం ఇళ్ల నిర్మాణాలకు రూ.1,045 కోట్లు అంచనా వేయగా రూ.287.59 కోట్లు ఖర్చు చేశారు. అంటే దాదాపు 28 శాతం ఖర్చు చేసినా అందులో ఐదో వంతు నిర్మాణాలు కూడా పూర్తి చేయలేదన్నమాట. ఈ ఇళ్ల పురోగతిలో జిల్లా చివరి వరుసలో ఉండటం గమనార్హం.

లక్ష్యం నెరవేరుతుందా!?

ఈ నెల 21న సామూహిక గృహ ప్రవేశాలు చేయాలని నిర్ణయించి అందుకు అనుగుణంగా జిల్లాలో దాదాపు 13,500 ఇళ్లు పూర్తి చేయాలని లక్ష్యం విధించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రతి వారం అధికార యంత్రాంగం సమీక్షిస్తున్నా నిర్మాణాల్లో పురోగతి మాత్రం కనిపించడం లేదు. నిర్దేశిత లక్ష్యం ప్రకారం అక్టోబరులో 3,036 ఇళ్లు పూర్తి చేయాల్సి ఉండగా 660, నవంబరులో 4600 నిర్మించాల్సి ఉండగా 698 మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన ఐదు రోజుల్లో లక్ష్యాన్ని ఎలా చేరుకుంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది. దాదాపు అన్ని లేఅవుట్లలో బేస్‌ లెవల్‌లో మొండి గోడలే కనిపిస్తున్నాయి. కొందరు లబ్ధిదారులు నిర్మించుకునేందుకు ఆసక్తిగా ఉన్నా ప్రభుత్వం సకాలంలో బిల్లులు ఇవ్వకపోవడంతో నిర్మాణాలు ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు పూర్తయిన ఇళ్లలో చాలా వరకు సొంత స్థలాల్లో నిర్మించుకున్నట్లు చూపించినవే కావడం గమనార్హం. అయితే సొంత స్థలాల్లో మంజూరైన ఇళ్లు నిర్మించకుండానే ఎప్పుడో నిర్మించిన ఇళ్లకు బిల్లులు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక ప్రారంభమైనట్లు చూపిస్తున్న అనేక ఇళ్లకు సంబంధించి స్టీల్‌, సిమెంటు తీసుకున్నారు. కానీ నిర్మాణాలు మాత్రం మొదలు కాలేదు.

Updated Date - 2022-12-16T00:22:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising