ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇష్టారాజ్యంగా ఉత్తర కాలువ పనులు

ABN, First Publish Date - 2022-06-25T05:12:45+05:30

సోమశిల పరిధిలోని ఉత్తరకాలువ ఆధునికీకరణ పనులు 0 నుంచి 18 కిలోమీటరు వరకు ఇటీవల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పంట పొలాల్లో తొలగించిన మట్టి 

అనంతసాగరం, జూన్‌ 24: సోమశిల పరిధిలోని ఉత్తరకాలువ ఆధునికీకరణ పనులు 0 నుంచి 18 కిలోమీటరు వరకు ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. పనులలో భాగంగా కాలువలో తీసిన మట్టిని పక్కనే గట్టుపై నిల్వ చేయాల్సి ఉండగా కాలువ పక్కన పంట పొలాల్లో పోస్తున్నారు. దీంతో పొలాలు సాగుకు పనికి రాకుండా పోతున్నట్లు రైతులు ఆందో ళన చెందుతున్నారు. 9వ కిలోమీటరు పాతాళపల్లి వద్ద ఈ పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై రైతులు పనులు చేసే సిబ్బందిని ప్రశిస్తే వారి నుంచి సమాధానం కరువైందని వాపోతున్నారు. కాలువలో తీసిన గ్రావెల్‌ పొలాలలో పోయడం వల్ల వ్యవసాయ మోటార్లు, విద్యుత్‌ మీటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతింటున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు కాలువ స్థలం గురించి ఎలాంటి సర్వే నిర్వహించకుండా రైతుల ప్రయోజనాలు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా పనులు చేయడం బాధాకరమన్నారు. పొలాల్లో వేసిన మట్టి కుప్పలు తొలగించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై సోమశిల ఇంజనీర్లు చర్యలు తీసుకోకపోతే పనులు నిలిపివేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2022-06-25T05:12:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising