ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోదాముల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయండి

ABN, First Publish Date - 2022-06-28T05:33:02+05:30

మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్‌ కింద రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా నిర్మిస్తున్న గోదాముల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయా లని జిల్లా కలెక్టర్‌ కేవీఎన్‌.చక్రధర్‌బాబు అధికారులను ఆదేశించారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు, వేదికపై జేసీ హరేందిర ప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌బాబు


నెల్లూరు(వ్యవసాయం), జూన్‌ 27: మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్‌ కింద  రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా నిర్మిస్తున్న గోదాముల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయా లని జిల్లా కలెక్టర్‌ కేవీఎన్‌.చక్రధర్‌బాబు అధికారులను ఆదేశించారు. నెల్లూరులోని జడ్పీ హాలులో  సోమవారం సాయంత్రం ఆయన పీఏసీఎస్‌లలో మల్టీపర్పస్‌ ఫెసిలిటి సెంటర్ల పనులను సమీక్షించేందుకు జిల్లాస్థాయి అమలు కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్‌బీకేలకు అనుసంధానంగా 26వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో నిర్మిస్తున్న 48 గోదాముల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ పనులకు సంబంఽధించిన బిల్లులు, చెల్లింపులను ఎప్పటికప్పుడు కమిటీ పర్యవేక్షణలో పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లా సహకారశాఖాధికారి తిరుపాల్‌రెడ్డి పనుల పురోగతిపై కలెక్టర్‌కు వివరించారు. ఈ సమావేశంలో జేసీ హరేందిరప్రసాద్‌, జిల్లా వ్యవసా యాధికారి సుధాకర్‌రాజు, మార్కెటింగ్‌ శాఖ ఏడీ రామమ్మ, నాబార్డు డీడీఎం రవిసింగ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-28T05:33:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising