గాంధీ ఆశ్రమంలో సర్వమత ప్రార్థనలు
ABN, First Publish Date - 2022-04-04T03:44:16+05:30
పల్లిపాడు పినాకినీ సత్యాగ్రహ గాంధీ ఆశ్రమంలో ఆదివారం ఆశ్రమ కో కన్వీనర్ నెల్లూరు రవీంద్రరెడ్డి ఆధ్వర్యంలో సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు.
ఇందుకూరుపేట, ఏప్రిల్ 3 : పల్లిపాడు పినాకినీ సత్యాగ్రహ గాంధీ ఆశ్రమంలో ఆదివారం ఆశ్రమ కో కన్వీనర్ నెల్లూరు రవీంద్రరెడ్డి ఆధ్వర్యంలో సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు.. ముందుగా గాంధీ ఆశ్రమ కమిటీ సభ్యులు బి.సుధారాణి మహాత్మాగాంధీ, పొణక కనకమ్మ విగ్రహాలకు నూలు మాల, ఖాదీ వస్త్రాలు సమర్పించారు. అనంతరం హిందూ, జైన, బౌద్ధ, ఇస్లాం, క్రైస్తవ, సిక్కు, తావొయిజం మతాలకు సంబంధించిన ప్రార్ధనలు చేశారు. గాంఽధీ ఆశయాలను కోర్ కమిటీ సభ్యుడు గంపల మంజుల విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ మేనేజర్ సాయి మనోజ్, పల్లిపాడు గ్రామ సర్పంచ్ రెడ్డిపోగు సుధాకర్, పీవీ శేషయ్య, స్కూల్ విద్యార్థులు, ఆశ్రమ రైతులు పాల్గొన్నారు.
Updated Date - 2022-04-04T03:44:16+05:30 IST