ఫ్లెక్సీల చించివేతపై ఫిర్యాదు
ABN, First Publish Date - 2022-12-31T23:27:13+05:30
నూతన సంవత్సరం సందర్భంగా తన అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడంపై శనివారం మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన వి
ఉదయగిరి రూరల్, డిసెంబరు 31: నూతన సంవత్సరం సందర్భంగా తన అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడంపై శనివారం మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన అభిమానులు సీఎం జగన్, జిల్లా పార్టీ నాయకులు, తన ఫొటోతోపాటు పలు మండలాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించడం దుర్మార్గమన్నారు. ఫ్లెక్సీలు చింపడం మగతనం కాదన్నారు. ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ తేల్చుకోవాలని హితవు పలికారు. కాగా దుత్తలూరులో కూడా ఫ్లెక్సీలు చించివేయడంతో పోలీసుస్టేషన్ ఎదుట చేజర్ల వర్గీయులు బైఠాయించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మోడి రామాంజనేయుల యాదవ్, మాజీ వైస్ ఎంపీపీ బీ శ్రీనివాసులు, నాయకులు చేజర్ల సుధాకర్‌రెడ్డి, ఎంఏ రియాజ్, యూ హరి, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వరికుంటపాడులో...
వరికుంటపాడు : స్థానిక బస్టాండ్ సెంటర్‌లో ఉదయగిరి మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని శనివారం గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చింపిన వారిపై చట్టరీత్యా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సుబ్బారెడ్డి అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
------------
Updated Date - 2022-12-31T23:27:15+05:30 IST