ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన

ABN, First Publish Date - 2022-01-29T04:04:50+05:30

అగ్ని ప్రమాదాల నివారణ, భద్రతపై ముత్తుకూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు.

శిక్షణ పొందుతున్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముత్తుకూరు, జనవరి 28: అగ్ని ప్రమాదాల నివారణ, భద్రతపై ముత్తుకూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఎంఈవో మధుసూదన, ప్రధానోపాధ్యాయుడు చెంచురామయ్య సూచనల మేరకు అదానీ కృష్ణపట్నం పోర్టు అగ్నిమాపక సిబ్బంది అగ్ని ప్రమాదాల సమయంలో ఎలా వ్యవహరించాలో విద్యార్థులకు వివరించారు. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి పడకుండా, నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు అందుబాటులో ఉన్న పరికరాలను ఎలా వినియోగించాలో విద్యార్థులచే స్వయంగా డ్రిల్‌ చేయించారు. అలాగే అగ్నిని నియంత్రించడం, తమను కాపాడుకోవడంతో పాటు, ఇతరులను రక్షించడంపై మాక్‌డ్రిల్‌ నిర్వహించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏకేపీఎల్‌ అగ్నిమాపక ముఖ్య అధికారి రవీంద్రనాథ్‌, అగ్నిమాపక సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-29T04:04:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising