ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దోమకాటుతోనే జ్వరాలు వస్తాయి

ABN, First Publish Date - 2022-10-12T05:04:53+05:30

దోమల కాటుతోనే రకరకాల జ్వరాలు ప్రబలుతాయని జిల్లా వైద్య విస్తరణ, బోధన అధికారి డాక్టర్‌ నరసింహారావు అన్నారు.

మడమనూరులో జ్వరపీడితులతో మాట్లాడుతున్న జిల్లా వైద్య విస్తరణ, బోధన అధికారి డా. నరసింహరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా వైద్య విస్తరణ అధికారి నరసింహారావు

నీరు కలుషితం అవుతోందని జ్వరపీడితుల ఆరోపణ

 మనుబోలు, అక్టోబరు 11: దోమల కాటుతోనే రకరకాల జ్వరాలు ప్రబలుతాయని జిల్లా వైద్య విస్తరణ, బోధన అధికారి డాక్టర్‌ నరసింహారావు అన్నారు. మండలంలోని మడమనూరు గ్రామంలో విషజ్వరాల నివారణకు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని మంగళవారం ఆయన పరిశీలించి జ్వరపీడితులతో మాట్లాడారు. గ్రామంలోకి వచ్చే తాగునీరు కలుషితమవుతోందని వారు వాపోయారు. జ్వరంతో పాటు కీళ్ల నొప్పులు, దద్దర్లు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. ఆయన మాట్లాడుతూ డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, వైరల్‌ ఫీవర్‌ ఇలా ఏదైనా దోమకాటు వల్లే వస్తాయన్నారు. ఎక్కువరోజులు ఇంట్లో నీటిని నిల్వ చేయొద్దన్నారు. కొబ్బరిబోండాలను తాగి దూరంగా పడేయాలన్నారు. పారిశుధ్యం మెరుగు, దోమల నివారణపై పంచాయతీ అధికారులతో మాట్లాడతామన్నారు. జ్వరాలతో ప్రాణాపాయం లేదని ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ నాగయ్య, ఏఎన్‌ఎంలు మీరమ్మ, శ్రీదేవి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-12T05:04:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising