ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు పొగాకు బ్యారన్ల దగ్ధం

ABN, First Publish Date - 2022-03-06T03:15:09+05:30

మండలంలోని గానుగపెంట పంచాయతీ ఆదిమూర్తిపురం గ్రామంలో శనివారం మూడు పొగాకు బ్యారన్లు దగ్ధమయ్యాయి.

మంటల్లో కాలిన పొగాకు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం

కొండాపురం, మార్చి 5: మండలంలోని గానుగపెంట పంచాయతీ ఆదిమూర్తిపురం గ్రామంలో శనివారం మూడు పొగాకు బ్యారన్లు దగ్ధమయ్యాయి. సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగింది. బాధితుల కథనం మేరకు... గ్రామానికి చెందిన కొందరు రైతులు నాలుగు బ్యారన్లు ఒకే ప్రదేశంలో నిర్మించుకున్నారు. అందులో ముత్యాల శ్రీధర్‌, తడకలూరు ధనమ్మ, తడకలూరు నాగరాజమ్మలకు చెందిన ఉమ్మడి బ్యారన్‌లో క్యూరింగ్‌ పూర్తయి పొగాకు కర్రలు దించేందుకు సిద్ధంగా ఉండగా ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. ఆర్పేందుకు ప్రయత్నించినా వీలులేకుండా మంటలు వ్యాపించాయి. దీంతో ఆ బ్యారిన్‌లో ముగ్గురు రైతులకు సుమారు రూ.5 లక్షల వరకు నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. అలాగే ఈ బ్యారనను ఆనుకుని ఉన్న తడకలూరి బాలకోటయ్య, తడకలూరి సిద్ధయ్య, తడకలూరి కోటేశ్వరమ్మలకు చెందిన ఉమ్మడి బ్యారన్‌, కొమ్మి కొండయ్యకుచెందిన మరొక బ్యారన్లకు మంటలు వ్యాపించి పాక్షికంగా కాలిపోయాయి. దీంతో  బ్యారన్లలో రూ.2.5 లక్షల చొప్పున నష్టం జరిగింది. సమాచారం అందుకున్న వింజమూరు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వారు చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Updated Date - 2022-03-06T03:15:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising