ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగనన్న ఇళ్లకు పైసా ఇవ్వలే...

ABN, First Publish Date - 2022-01-26T05:02:20+05:30

‘మాఊర్లో జగనన్న ఇళ్లు రెండు కట్టి 6 నెలలు అయ్యింది. ఇంత వరకు ఒక్క పైసాకూడా ఇవ్వలే... సాక్షాత్తు అధికారపార్టీకి చెందిన మండల పరిషత్‌ ఎక్స్‌ అఫిషియో సభ్యుడు సుకుమార్‌ అధికారులను నిలదీశాడు.

మండల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ అనిల్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మండల సమావేశంలో  నిలదీసిన అధికార పార్టీ సభ్యుడు 

సూళ్లూరుపేట, జనవరి 25 : ‘మాఊర్లో జగనన్న ఇళ్లు రెండు కట్టి 6 నెలలు అయ్యింది. ఇంత వరకు ఒక్క పైసాకూడా ఇవ్వలే... సాక్షాత్తు అధికారపార్టీకి చెందిన మండల పరిషత్‌ ఎక్స్‌ అఫిషియో సభ్యుడు సుకుమార్‌ అధికారులను నిలదీశాడు. మంగళవారం సూళ్లూరుపేట మండల పరిషత్‌ సమావేశం జరిగింది.  హౌసింగ్‌ ఏఈ అక్రమ్‌ జగనన్న ఇళ్లు ఎంత త్వరగా నిర్మించుకుంటే అంత త్వరగా బిల్లులు చెల్లిస్తామని చెప్పడంతో రెండు ఇళ్లు కట్టుకున్నా డబ్బులు ఇచ్చారా అని సుకుమార్‌ నిలదీయడంతో ఎంపీపీ అనిల్‌రెడ్డి కల్పించుకున్నారు. ఎక్కడో ఎదో పొరపాటు జరగి ఉంటుంది. పరిశీలించి బిల్లులు చెల్లించండంటూ  అధికారులను కోరారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ ఉమామహేశ్వరి మంగానెల్లూరు, వెలగలపొన్నూరు గ్రామాల్లో జలజీవనమిషన్‌ పనులు ప్రారంభించలేదని, అక్కడి ప్రజా ప్రతినిధులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జగనన్న కాలనీలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించకపోవడం నిర్మాణాలకు ఇబ్బంది అవుతుందని పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, సభ దృష్టికి తీసుకువచ్చారు. త్వరలో అన్ని జగనన్న కాలనీలకు విద్యుత్‌ ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. స్థానిక ఎంపీడీవో వినిల్‌కుమార్‌, అన్నిశాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-26T05:02:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising