ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుల్హన్‌పై దుష్ప్రచారం తగదు : ఎమ్మెల్యే మహీధరరెడ్డి

ABN, First Publish Date - 2022-06-29T03:36:20+05:30

దుల్హన్‌ పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసినట్లుగా దుష్ప్రచారం చేయటం తగదని ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి పేర్కొన్నారు

విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మహీధరరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు, జూన్‌ 28: దుల్హన్‌ పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసినట్లుగా దుష్ప్రచారం చేయటం తగదని ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో  విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ పథకాన్ని అమలు చేయటం సాధ్యం కాదని, మారిన పరిస్థితుల్లో మెరుగ్గా అమలు చేసేందుకు పరిశీలన చేస్తున్నామని సీఎం జగన్‌ కోర్టుకి నివేదించారని తెలిపారు. అయితే ఈ పథకం రద్దయినట్లు కొందరు మాట్లాడుతుండటం అర్థరహితమని పేర్కొన్నారు. కందుకూరు రూరల్‌ మండలంలోని గ్రామాలకు తాగునీరందించేందుకు సీపీడబ్ల్యూ స్కీమ్‌కు రూ.23 కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. త్వరలోనే టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. రాళ్లపాడుకు వెలిగొండ జలాల తరలింపునకు కూడా గ్రీన్‌సిగ్నల్‌ వచ్చిందని తెలిపారు. 


 రేపు ప్లీనరీ


నెల్లూరు జిల్లా  వైసీపీ ప్లీనరీ నెల్లూరు సమీపంలోని కనపర్తిపాడు వీపీఆర్‌ కన్వెన్షన్‌ హాలులో గురువారం ఉదయం  జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. 


Updated Date - 2022-06-29T03:36:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising