శ్రీకాంత్ గెలుపు కోసం సమష్టిగా పని చేయండి
ABN, First Publish Date - 2022-10-08T04:25:29+05:30
తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గెలుపు కోసం అందరూ సమష్టిగా పని చేయాలని సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు.
వెంకటాచలం, అక్టోబరు 7 : తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గెలుపు కోసం అందరూ సమష్టిగా పని చేయాలని సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని కనుపూరు, వెంకటాచలం గ్రామాల్లో ఆయన శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో 2019 నవంబరు నాటికి డిగ్రీ పూర్తయిన పట్టభద్రులందరితో ఓటుకు దరఖాస్తు చేయించాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూప డంలో విఫల మైందని విమర్శించారు. దాంతో పట్టభద్రులందరూ టీడీపీ వైపే ఉన్నారన్నారు. గ్రామాల్లో టీడీపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని కోరారు. ఓటరు వెరిఫికేషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని సూచించారు. సీఎంగా మరోసారి చంద్రబాబు నాయుడును, సర్వేపల్లి ఎమ్మెల్యేగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గుమ్మడి రాజాయాదవ్, మెదరమెట్ల కోదం డయ్య నాయుడు, ఉప్పలపాటి ధనుంజయనాయుడు, చల్లా నాగార్జునరెడ్డి, కొండప్ప నాయుడు, పఠాన్ ఖయ్యూమ్‌ఖాన్, నిక్కుదల రమేష్, రమణయ్య, వలిపి వెంకటేష్ పాల్గొన్నారు.
Updated Date - 2022-10-08T04:25:29+05:30 IST