ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో 90 రోజులు అజాదికా అమృత మహోత్సవం

ABN, First Publish Date - 2022-05-19T03:25:24+05:30

అజాదికా అమృత మహోత్సవ కార్యక్రమం జిల్లాలో 90 రోజులు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పెంచలయ్య అన్నారు.

మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో పెంచలయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఎంహెచ్‌వో డాక్టర్‌ పెంచలయ్య

నెల్లూరు(వైద్యం), మే 18 : అజాదికా అమృత మహోత్సవ కార్యక్రమం జిల్లాలో 90 రోజులు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పెంచలయ్య అన్నారు. బుధవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలోని తన చాంబర్‌లో సంయుక్త కార్యాచరణపై సమీక్షించారు. ఆగస్టు 15వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించేలా ప్రభుత్వం మన జిల్లాను ఎంపిక చేసిందన్నారు. ప్రధానంగా పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు గుర్తించటం జరిగిందన్నారు. దీనికి అనుగుణంగా అవసరమైన రీతిలో అదనపు పోషకాహారంతో పాటు చికిత్స చేయాల్సి ఉందని చెప్పారు. సదరన్‌ క్యాంపులో వైకల్యంతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి చికిత్సతో పాటు సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం ద్వారా ప్రతి తొలి కాన్పు గర్భిణులను గుర్తించి వారికి ఆర్థిక సాయం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ ఉమామహేశ్వరి, డీసీహెచ్‌ఎస్‌ రమేష్‌నాథ్‌, ఆత్మకూరు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుబ్బారెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ దయాకర్‌, డాక్టర్‌ ప్రియంవద, డాక్టర్‌ అమర్‌నాథ్‌రెడ్డి, డెమో శ్రీనివాసరావు, సురేష్‌, డిప్యూటీ డెమో శ్రీనివాసులు, రిషికేశవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T03:25:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising